Kerala
Kerala : కేరళలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి రోడ్డుపై దూసుకెళ్లింది. డ్రైవర్ అదుపు చేయడంతో ఘోర ప్రమాదం తప్పింది. వర్షం కురిసిన రోడ్డుపై హైడ్రో ప్లానింగ్ వల్లే ఈ ఘటనకు జరిగినట్లు తెలుస్తోంది.
Kerala High Court : జడ్జీలు దేవుళ్లు కాదు.. వాళ్లెదుట చేతులు కట్టుకోవాల్సినవసరం లేదు : కేరళ హైకోర్టు
కేరళలో ఓ బస్సు అదుపు తప్పి రోడ్డుపై దూసుకెళ్లిన ఘటనలో డ్రైవర్ బస్సును అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వర్షం కారణంగా జారే రోడ్డుపై ఏర్పడే హైడ్రో ప్లానింగ్ ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది.
Kerala high court : నాకు బిడ్డను కనాలని ఉందని జీవిత ఖైదీ భార్య వినతి…కేరళ హైకోర్టు సంచలన ఉత్తర్వులు
వర్షంలో తడిసిన రోడ్డుపై వేగంగా వెడుతున్న ఓ ప్రైవేటు బస్సు ఒక వంపు వద్ద మలుపు తీసుకుంటూ అదుపు తప్పింది. దాంతో ఒక్కసారిగా అది జారిపోవడంతో ఓ స్తంభాన్ని ఢీ కొట్టింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోకుండా దానిని అదుపులోకి తీసుకురావడంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. హైడ్రో ప్లానింగ్ కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. టైర్లు, రోడ్డుకి మధ్య నీటి పొర ఏర్పడినప్పుడు ఇవి సంభవిస్తాయి. హైడ్రో ప్లానింగ్ టైర్లను స్కిడ్ అయ్యేలా చేస్తుంది. వర్షం పడిన సమయంలో డ్రైవర్లు వేగం తగ్గించి నడపడం మంచిది.
#WATCH | கேரளா: மழையால் கட்டுப்பாட்டை இழந்து சாலையில் சறுக்கிய தனியார் பேருந்து – ஓட்டுநர் சமாளித்ததால், சிறு காயங்களுடன் பயணிகள் அனைவரும் உயிர் தப்பினர்!#SunNews | #Accident | #Kerala pic.twitter.com/rypVbcQ2hn
— Sun News (@sunnewstamil) October 26, 2023