PM Modi: నేడు కీలక సమావేశం.. క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధం!

కేంద్ర మంత్రి మండలి విస్తరణ జరగనుందని చాలారోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈమేరకు ఇప్పటికే పలుదఫాలుగా ప్రధాని నరేంద్ర మోడీ.. మంత్రులు, పార్టీ పెద్దలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఇప్పటికే క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధంకాగా ప్రధాని నేడో రేపో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మోడీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే రెండేళ్ల పాలన పూర్తి చేసుకోగా సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు గడువు ఉంది.

Pm Modi

PM Modi: కేంద్ర మంత్రి మండలి విస్తరణ జరగనుందని చాలారోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈమేరకు ఇప్పటికే పలుదఫాలుగా ప్రధాని నరేంద్ర మోడీ.. మంత్రులు, పార్టీ పెద్దలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఇప్పటికే క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధంకాగా ప్రధాని నేడో రేపో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మోడీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే రెండేళ్ల పాలన పూర్తి చేసుకోగా సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు గడువు ఉంది. అయితే, వచ్చే ఏడాది పలు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి.

ఈ క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలోనే శని, ఆది, సోమవారాల్లో ప్రధాని.. హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌లతో చర్చించి విస్తరణ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. కాగా నేడు ప్రధాని మోడీ మంగళవారం మరోసారి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా సహా మరికొందరు మంత్రులు సైతం భేటీకి హాజరుకానున్నారు.

ఈ సమావేశం సాయంత్రం 5 గంటలకు ప్రధాని నివాసంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్‌లోకి కనీసం 18 మంది కొత్త మంత్రులను చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం కాగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న మంత్రిత్వశాఖలతో పాటు సరిగా పని చేయని మంత్రుల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గాన్ని బుధవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుండగా మంగళవారం సమావేశం.. రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎవరికి బెర్త్ దక్కుతుందనే ఉత్సుకత నెలకొంది.