Mamata Benerjee : ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ను TMC రీప్లేస్ చేస్తుందా..?

బెంగాల్లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే టీఎంసీ ఇతర రాష్ట్రాల్లోనూ తన మార్క్ చూపిస్తోంది.

Mamata Benerjee : దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా తృణమూల్ కాంగ్రెస్ అవతరించబోతోందా..? మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే నిజమేననిపిస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ లో మమత బెనర్జీ(Mamata Benerjee) నేతృత్వంలో టీఎంసీ(TMC) సృష్టించిన ప్రభంజనం.. దేశ రాజకీయాల్లో సరికొత్త ఈక్వేషన్ ను తెరపైకి తెస్తుందని అంచనాలు మొదలయ్యాయి. పలు రాష్ట్రాల్లో మారిన, మారుతున్న పరిణామాలు కూడా దీనికి తోడవుతున్నాయి.

Read This : New Farm Laws: కేంద్రంపై రైతుల ఉద్యమానికి ఏడాది పూర్తి

టీఎంసీ నెక్స్ట లెవల్ రాజకీయం

2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం టీఎంసీకి డబుల్ బూస్ట్ ఇచ్చింది. 2019 జనరల్ ఎలక్షన్స్ లో వెస్ట్ బెంగాల్ లోని 42 లోక్ సభ సీట్లలో బీజేపీ 18 సీట్లు గెల్చుకుని ఓ సుడిగాలి వేవ్ క్రియేట్ చేసింది. West Bengalలో అధికారంపై మమత బెనర్జీని బీజేపీ(BJP) సవాల్ చేసింది. దాదాపు రెండేళ్లు బీజేపీ .. బెంగాల్ లో ఒక రేంజ్ లో హంగామా చేసింది. 2021 అసెంబ్లీ ఎన్నికల వరకు… అటు బీజేపీ, ఇటు టీఎంసీ పోరు కొదమ సింహాలను తలపించింది. ఐతే… అసెంబ్లీ ఫలితాల్లో చివరకు.. అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. బెంగాల్ లో సీనియర్లైన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు ఒక్క సీట్ కూడా దక్కలేదు. ఈ గెలుపే పునాదిగా… దేశ రాజకీయాల్లో టీఎంసీ Next Levelకు చేరుకోబోతోందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

బెంగాల్ లో టీఎంసీకి 32 ఎంపీ సీట్లు రానున్నాయా..?

2014 పార్లమెంట్ ఎన్నికల్లో టీఎంసీ.. 39.8% ఓట్లతో 34 ఎంపీ సీట్లు గెల్చుకుంది. ఇదే ఇప్పటివరకు టీఎంసీ బెస్ట్ పెర్ఫామెన్స్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి 48.5% ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్ పోలింగ్ పర్సెంటేజీ లెక్కల ప్రకారం పోల్చి చూసుకుంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో టీఎంసీకి 32 ఎంపీ సీట్లు వస్తాయన్న అంచనా ఉంది. బెంగాల్ లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలిన ఈ సందర్భంలో… 2024 ఎన్నికల్లో 2014 సీన్ రిపీట్ అవుతుందని.. కనీసం 32 సీట్లను తృణమూల్ గెల్చుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మేఘాలయలో పవర్ గేమ్
బెంగాల్లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే టీఎంసీ ఇతర రాష్ట్రాల్లోనూ తన మార్క్ చూపిస్తోంది. ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో 12 మంది కాంగ్రెస్ సభ్యలపై అనర్హత వేటుతో.. టీఎంసీ ప్రధాన ప్రతిపక్షం రోల్ లోకి వచ్చేసింది. నాయకులు కూడా టీఎంసీ వైపే చూస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు అందకూడా.. ఈశాన్య రాష్ట్రాల్లో టీఎంసీకి ఆదరణ పెరుగుతోందన్న సూచనలు ఉన్నాయి.

Read This : Subramanian Swamy: దీదీపై పొగడ్తలు..మోదీపై విమర్శలు..‘దటీజ్ మమతా’అంటూ ఎంపీ ఎంపీసుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ కు తగ్గుతున్న ఆదరణ
2019 జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓవరాల్ గా వచ్చిన ఎంపీ సీట్లు 52. రాష్ట్రాల వారీగా కేరళలో 15, పంజాబ్ లో 8, తమిళనాడులో 8 సీట్లే ఆ పార్టీకి మేజర్ షేర్ ఇచ్చాయి. ఆ తర్వాత జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ఫలితాలు చూసింది. పంజాబ్ లోనూ.. కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాతో చీలిక వచ్చింది. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేతో అలయన్స్ పైనే కాంగ్రెస్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అస్సాంలో 3 ఎంపీ సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్ కూటమి AIUDF.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదుర్కొంది. అస్సాంలో కాంగ్రెస్ కూటమి హిందూ ఓట్లు… బీజేపీ, టీఎంసీలకు చీలిపోయిన పరిస్థితి. ఈ పరిణామాలతో.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తన ప్రధాన ప్రతిపక్ష పాత్రను.. టీఎంసీకి కోల్పోతుందన్న కచ్చిత అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే… మిగతా రాష్ట్రాల్లో తమ పార్టీ ఫోకస్ పెట్టి భారీ ఫలితాలు రాబడుతుందనేది కాంగ్రెస్ నేతల అభిప్రాయం.

ట్రెండింగ్ వార్తలు