Subramanian Swamy: దీదీపై పొగడ్తలు..మోదీపై విమర్శలు..‘దటీజ్ మమతా’అంటూ ఎంపీ ఎంపీసుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎంపీ ఎంపీసుబ్రహ్మణ్యస్వామి దీదీపై పొగడ్తలు కురిపించారు. అదేసయమంలో మోదీపై విమర్శలు..సంధించారు. దటీజ్ మమతా’ అన్నట్లుగా ఎంపీసుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయ

Subramanian Swamy: దీదీపై పొగడ్తలు..మోదీపై విమర్శలు..‘దటీజ్ మమతా’అంటూ ఎంపీ ఎంపీసుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

Mp Subramanian Swamy Calls Modi Govt A Failure

MP Subramanian Swamy calls Modi govt a failure : బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఎప్పుడు ఓ వినూత్న వ్యక్తిగా కనిపిస్తారు. రాజకీయాల్లో ఈయనగారి స్టైల్ ఎవ్వరికి రాదు. స్వపక్షమైనా..విపక్షమైనా సరే ఎవరి గురించి ఆయన ఏమనుకుంటున్నారో అదే చెబుతారు. అది ప్రధాని అయినా సరే విమర్శలు చేయటంలో ఏమాత్రం వెనుకాడరు అని మరోసారి నిరూపించారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన నోరు విప్పారు అంటే ఎవరికో సెటైర్ పడినట్లే. తన పార్టీ నేతల్ని కూడా ఆయన వదిలిపెట్టరు. అలాగే ప్రధాని మోదీని విమర్శించటానికికూడా ఏమాత్రం తగ్గేదిలేదు అన్నట్లుగా ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. స్వపక్షంలో కాస్త ఇబ్బందికలిగిస్తుంటాయి..

Read more : Mamata Meets PM Modi : మోదీతో దీదీ భేటీ..యూపీ ఎన్నికల్లో అఖిలేష్ కి మద్దతు

ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. అక్కడి వరకే అయితే పెద్ద వింతా కాదువిశేషం అంతకంటే కాదు..కానీ ఆయన బెంగాల్ లో బీజేపీకే కాదు బీజేపీ అధిష్టానికికి కూడా కొరుకుడు పడని మమతా బెనర్జీనీ ప్రశంసలతో ముంచెత్తారు. అదే సయమంలో మోదీని విమర్శలతో ఏకిపారేసారు. మోదీ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో సుబ్రమణ్యస్వామి విరుచుకుపడ్డారు. ఇదీ..అదీ అని కాదు అన్నింటిలోనూ మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు.బుధవారం (నవంబర్ 14,2021)టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. హస్తిన పర్యటనలో ఉన్న దీదీ మోదీని కలిసారు. మోదీతో దీదీ తమిళనాడు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు సరిహద్దు భద్రతా దళం (BSF) అధికార పరిధి విస్తరణపై చర్చించారు. ఉప్పు,నిప్పులా ఉండే వీరిద్దరు సమావేశం కావటం హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలో మమతా మోదీతో భేటీ అయిన మరునాడే..సుబ్రహ్మణ్యస్వామి దీదీపై ప్రశంసలు కురిపించటంతో పాటు మోదీ ప్రభుత్వంపై విమర్శలు సంధించటం..ప్రాధాన్యం సంతరించుకుంది.మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు భద్రత, విదేశీ వ్యవహారాలు, అంతర్గత భద్రత వంటి విషయాల్లో విఫలమైందన్నారు సుబ్రహ్మణ్యస్వామి.. అఫ్ఘానిస్థాన్ సంక్షోభ విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును ‘అపజయం’గా అభివర్ణించారు ఆయన. అలాగే, పెగాసస్ డేటా భద్రతా ఉల్లంఘన విషయంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.

Read more : Mamata Banerjee : సోనియాను ఎందుకు కలవాలి? అదేమీ రాజ్యాంగ నిబంధన కాదు – మమత 

అదేసమయంలో సీఎం మమతా బెనర్జీపై సుబ్రహ్మణ్యస్వామి ప్రశంసలు కురిపించారు. దీదీ జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్, పీవీ నరసింహారావు వంటి రాజకీయ దిగ్గజాలతో పోల్చారు. దీదీ చెప్పిందే చేస్తారని, చేసేదే చెబుతారు స్టైట్ ఫార్డాడ్ వ్యక్తి ఆమె అంటూ పొగడ్తలు కురిపించారు. రాజకీయాల్లో ఇటు గుణం చాలా అరుదు అంటూ ఆకాశానికెత్తేశారు.

సుబ్రహ్మణ్యస్వామి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ‘‘మన అణ్వాయుధానికి చైనా భయపడకపోతే, వారి అణ్వాయుధానికి మనం ఎందుకు భయపడుతున్నాం?’’ అంటూ నవంబర్ 23న ట్వీట్ చేసి సంచనలం క్రియేట్ చేశారు. అంతకుముందు ధరల పెరుగుదలపై ఓ ట్విట్టర్ యూజర్‌ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రధాని మోదీకి ఆర్థికశాస్త్రం తెలియదని అన్నారు.

విదేశీ వ్యవహారాలు, జాతీయ భద్రత విషయంలో భారతదేశ పరిస్థితి ఏమంత బాగోలేదని అన్నారు. చైనా మన భూభాగాన్ని దోచుకుంటున్నప్పుడు ప్రభుత్వం నిద్రపోతోందంటూ ఏకిపారేశారు. భారతమాతను అణగదొక్కిన ఈ వ్యక్తులు చైనాను దురాక్రమణదారు అని పిలవడానికి ఇష్టపడడం లేదని సుబ్రహ్మణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.