Mamata Banerjee : సోనియాను ఎందుకు కలవాలి? అదేమీ రాజ్యాంగ నిబంధన కాదు – మమత

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్బంగా సోనియాని కలవాలని రాజ్యాంగంలో లేదు కదా అంటూ సమాధానమిచ్చారు

Mamata Banerjee : సోనియాను ఎందుకు కలవాలి? అదేమీ రాజ్యాంగ నిబంధన కాదు – మమత

Mamata Banerjee

Updated On : November 25, 2021 / 7:07 AM IST

Mamata Banerjee : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. సరిహద్దు రాష్ట్రాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎస్) అధికార పరిధి పెంపుపై సీఎం మమతా, ప్రధాని మోడీతో చర్చించారు. అంతర్జాతీయ సరిహద్దు 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

చదవండి : Mamata Meets PM Modi : మోదీతో దీదీ భేటీ..యూపీ ఎన్నికల్లో అఖిలేష్ కి మద్దతు

బీఎస్ఎఫ్ కు మరిన్ని అధికారులు కట్టబెడితే రాష్ట్ర పరిధిలోని శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పుకొచ్చారు. ఇది దేశ సమాఖ్య వ్యవస్థకు భంగం కలిగించేందుకు యత్నించడం సరికాదని ప్రధానిని కోరినట్లు చెప్పారు. 2022లో కోల్‌కతాలో జరగనున్న గ్లోబల్ బిసినెస్ సమ్మిట్ ప్రారంభానికి ప్రధాని మోడీని ఆహ్వానించారు మమతా..

చదవండి : Mamata Benerjee: కాంగ్రెస్‌పై దీదీ ఫైర్

ఇక అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.. రాష్ట్ర అభివృద్ధి అంశాలతోపాటు.. అంతర్జాతీయ సరిహద్దు పెంపు అంశంపై మాట్లాడినట్లు తెలిపారు. సోనియాను సమావేశమయ్యారా అని విలేకర్లు ప్రశ్నించగా..ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ సోనియాను ఎందుకు కలవాలి? అదేమీ రాజ్యాంగ నిబంధన కాదు’ అని చెప్పారు.