కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా కుమారుడు Ryan Rajiv Vadra షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. Ranthambore National Parkలో తన కెమెరాలో బంధించిన ఒక ఫోటోను రియాన్ వాద్రా తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు. నెటిజన్లకు పరీక్ష పెట్టాడు.. తాను షేర్ చేసిన ఫొటోలో ఒక పులి కన్ను ఎక్కడ ఉందో కనిపెట్టండి అన్నట్టుగా ఉంది.
20ఏళ్ల రియాన్ రాజీవ్ వాద్రా ప్రస్తుతం వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. రాజస్థాన్ వైల్డ్ లైఫ్ పార్కులోని వన్య ప్రాణాల ఫొటోలు తీసి ఫాలోవర్లతో పంచుకుంటున్నారు. పేయింటింగ్ ఫీచర్ టైగర్లకు ఈ పార్క్ ఎంతో ఫేమస్ కూడా.. ప్రియాంక వాద్రా కుమారుడు రియాన్ పోస్టు చేసిన ఫొటోలో.. పచ్చని ఆకుల మధ్య ఒక పులి కన్ను కనిపిస్తోంది.
Eye Spy
T-101, Zone – 6, Ranthambore National Park, 06/10/20. pic.twitter.com/nQ5g2RV9Wp
— Raihan Rajiv Vadra (@raihanrvadra) October 7, 2020
ప్రకృతి రంగుల మధ్య ఆ పులి కన్ను కూడా అదే రంగులో కనిపిస్తోంది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు.. పులి కన్ను ఎక్కడ ఉందో కనిపెట్టండి చూద్దాం అంటూ షేర్లు, రీట్వీట్లు చేసేస్తున్నారు. ఈ నెల అక్టోబర్ 6న నేషనల్ పార్కులో జోన్ 6 వద్ద రియాన్ వాద్రా ఈ ఫొటోను తీశారు. ఇప్పుడీ ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.