సరి-బేసి లాజిక్ ఏంటీ : కేంద్రం,ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం అక్షింతలు

దేశరాజధాని ఢిల్లీ ప్రతి సంవత్సరం వాయుకాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోందని,దీనిని కంట్రోల్ చేయలేకపోతున్నామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రతి సంవత్సరం ఢిల్లీలో ఇదే జరుగుతోందని,10-15 రోజులు వాయుకాలుష్యం తీవ్రంగా కొనసాగుతుందని,నాగరిక దేశాలలో ఇలా జరగదని సుప్రీం తెలిపింది. జీవించే హక్కు చాలా ముఖ్యమైనదని సృష్టం చేసింది. ఇళ్లల్లో కూడా ప్రజలు సేఫ్ గా లేరని సుప్రీం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం,ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరస్పరం ఆరోపణలు చేసుకోవడం మాని కాలుష్య నివారణకు పరిష్కారం కనిపెట్టాలంటూ అక్షింతలు వేసింది. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం ప్రభుత్వం కలిసికట్టుగా కాలుష్యం నివారణకు కోసం పనిచేయాలని సూచించారు. సరి-బేసి విధానం వెనుక ఉన్న లాజిక్ ఏంటని కేజ్రీవాల్ సర్కార్ ని సుప్రీం ప్రశ్నించింది. డీజిల్ వాహనాలను బ్యాన్ చేస్తే సరే కానీ,సరి-బేసి విధానం ఏంటని సుప్రీం ప్రశ్నించిందిసరి-బేసి విధానం ఢిల్లీలో కాలుష్యం తగ్గించిందని నిరూపించే రికార్డుల డేటాను శుక్రవారంలోగా కోర్టుకు సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది.

నగరంలోని ఒక్క ఇంట్లో కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి లేదు. దీని కారణంగా ప్రతి సంవత్సరం విలువైన ప్రాణాలను కోల్పోతున్నామని జస్టిస్ అరుణ్ మిశ్రా అన్నారు. పంజాబ్, హర్యానాలో రైతులు చెత్త తగలబెట్టకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ధర్మాసనం సూచించింది. పంజాబ్,హర్యానా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు,గ్రామ్ ప్రధాన్ లకు,స్థానిక అధికారులకు,పోలీసులకు సమన్లు జారీ చేయనున్నట్లు,పంటల తబులబెట్టడాన్ని కంట్రోల్ చేయలేకపోతే వారిని పదవుల్లో నుంచి తొలగించబడాలని మిశ్రా తెలిపారు. ఢిల్లీలో పబ్లిక్ హెల్త్ కొనసాగుతోంది. దీపావళి రోజు రాత్రి నుంచి రాజధానిలో తీవ్ర వాయుకాలుష్యం నెలకొని ఉంది. జనాలు ఇళ్లల్లో నుంచి రావాలంటే భయపడిపోతున్నారు.