ఢిల్లీ : పెట్టుబడిదారీ విధానం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటుందని హెచ్చరించారు RBI మాజీ చీఫ్ రఘురాం రాజన్. ఇది ప్రపంచానికే పెను సవాల్ గా అభిప్రాయపడ్డారాయన. ఢిల్లీలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. రాబోయే విపత్కర పరిస్థితులను వివరించారు. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంలో లక్షల ఉద్యోగాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తూ.. మరోసారి ఇలాంటి పరిస్థితుల తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారాయన. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2008 నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయని హెచ్చరించారు.
Read Also : రాఫెల్ డీల్‌పై రాహుల్ ఎటాక్ : అంబానీ ‘పేపర్ ప్లేన్’ కూడా చేయలేడు
రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు.. ప్రజల గురించి పట్టించుకోకపోవటమే ఇందుకు కారణంగా విశ్లేషించారాయన. పదేళ్ల క్రితం వచ్చిన ఆర్థిక సంక్షోభంతో సామాన్యులు.. దిక్కులేని వారిగా మారిపోయారని.. ఇప్పటి ప్రభుత్వాలు, కార్పొరేట్ వ్యవస్థలు కూడా అలాగే తయారు అయ్యాయని అభిప్రాయపడ్డారు. ఇది ప్రమాదకర సంకేతాలకు దారి తీస్తుందని వార్నింగ్ ఇచ్చారాయన. ప్రభుత్వాల వైఖరిలో మార్పు రావాలన్నారు.
ప్రపంచంలో విప్లవకర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. పెట్టుబడిదారీ విధానం మెజారిటీ ప్రజానీకానికి ఏమీ చేయలేకపోతుందని.. ఆ మెజారిటీ ప్రజానీకమే పెట్టుబడిదారీ విధానంపై తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. ప్రజలకు అవకాశాలను మెరుగుపర్చాల్సి ఉందన్నారు. 2008 తర్వాత ప్రభుత్వాల రుణభారం 77 శాతం, కార్పొరేట్ రుణభారం 51 శాతం పెరిగాయని తెలిపారు.