Uttar Pradesh: 138 ఏళ్లనాటి వంశమూలాలను అన్వేషిస్తు భారత్ వచ్చిన కరేబియన్ మహిళ .. ‘బ్రహ్మోత్సవం’ సినిమాలాంటి రియల్ స్టోరీ..

138 ఏళ్లనాటి తన వంశ మూలాలను వెదుక్కుంటు భారత్ వచ్చారు ఓ మహిళ.ఎన్నో అవరోధాలను ఎదర్కొని తన బంధువులు ఎక్కడెక్కడ నివసిస్తున్నారో తెలుసుకోవటానికి అన్వేషణ ప్రారంభించారు ట్రినిడాడ్‌ - టొబాగోకు సునీతి మహారాజ్‌ అనే మహిళ. ఆమె అన్వేషణ ఫలించింది.

Trinidad and Tobago women search for relative roots 138 years

Uttar Pradesh : తన వంశ మూలాలను వెదుక్కుంటు బయలుదేరింది ఓ మహిళ.ఎన్నో అవరోధాలను ఎదర్కొని తన బంధువులు ఎక్కడెక్కడ నివసిస్తున్నారో తెలుసుకోవటానికి అన్వేషణ ప్రారంభించారు ట్రినిడాడ్‌ – టొబాగోకు సునీతి మహారాజ్‌ అనే మహిళ. ట్రినిడాడ్‌ – టొబాగోకు అనేది కరిబియన్ సముద్రంలోని ద్వీపదేశం. ఆమె అన్వేషణ ఫలించింది. తెలుగులో హీరో మహేశ్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాను మించిన అన్వేషణలో సునీతి విజయం సాధించారు. తన 138 ఏళ్లనాటి వంశమూలాలను కనుగొని బంధువులను కలుసుకుని వారితో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.

సాధారణంగా మన తాత పేరు తెలుస్తుంది.. మహా అయితే ముత్తాత పేరు తెలుస్తుంది..కానీ వారి నాన్న వారి నాన్న వారి తాత ముత్తాల పేర్లు కూడా తెలియని ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా 138 ఏళ్ల క్రితం ఎక్కెడెక్కడే స్థిరపడి నివసిస్తున్న బంధువులను కనుగొనటం అంటే మాటలు కాదు. దగ్గర బంధువులను కూడా పట్టించుకోకుండా వదిలేసుకుంటున్న ఈరోజుల్లో 138 ఏళ్ల నాటి వంశస్తులు ఎక్కడున్నారో..వారు ఏం చేస్తున్నారో..వారి ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు..వారిని కలుసుకోవాలనుకుని తపన పడ్డారు సునీతి మహారాజ్‌ అనే మహిళ.

అలా ఎట్టకేలకు ఆమె అన్వేషణ ఫలించి ఉత్తరప్రదేశ్ లోని జౌన్ పూర్ జిల్లా ఆదిపూర్ గ్రామంలో నివసిస్తున్న బంధువులను కలుసుకున్నారు. తన పూర్వీకులను మొదటిసారి చూసిన సునీతి ఆనందంతో భావోద్వేగానికి గురి అయి తనను తాను పరిచయం చేసుకుని వారి కౌగలించుకుని భావోద్వేగానికి గురి అయ్యారు.

తన పూర్వీకుల కోసం అన్వేషిస్తూ ట్రినిడాడ్‌ – టొబాగోకు చెందిన సునీతి మహారాజ్‌ చేసిన ప్రయత్నం ఫలించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ జౌన్‌పుర్‌ జిల్లా అదిపుర్‌ గ్రామంలో సోమవారం (ఏప్రిల్10,2023)న చోటు చేసుకుంది.138 ఏళ్ల క్రితం నాటి తమ వంశ మూలాలను కనుగొనేందుకు సునీతి చేపట్టిన అన్వేషణలో ఇండెంచర్డ్‌ లేబరర్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు దిలీప్‌ గిరి ప్రముఖ పాత్ర పోషించారు. తన పూర్వీకుల కోసం సునీతి వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు డబ్బులతో భారతదేశపు సంస్కృతి సంప్రదాయాలతో ఘన స్వాగతం పలికారు. దేశం కాని  దేశం నుంచి పూర్వీకుల కోసం వచ్చిన ఆమెను గ్రామస్తులు ఆసక్తిగా గమనించారు. తన పూర్వీకులతో కలిసి స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

‘‘మా ముత్తాత నారాయణ్‌ దూబేను ఒప్పంద కార్మికుడిగా బ్రిటీషర్లు 1885లో ట్రినిడాడ్‌ – టొబాగోకు తరలించారు. కానీ భారత్‌లో గల నా పూర్వీకులను కలుసుకోవాలని ఆశపడ్డారు.నా వంశ మూలాలను తెలుసుకుని వారిని కలుసుకోవాలని తపనపడ్డాను.ఈ అన్వేషణలో నాకు ఇండెంచర్డ్‌ లేబరర్స్‌ ఫౌండేషన్‌ నాకు చాలా చాలా సహాయం చేసింది. నా కుటుంబంలో నాల్గవ తరానికి చెందినదాన్ని.. నా పూర్వీకులను కలుసుకోవటానికి సహాయపడిన ఇండెంచర్డ్‌ లేబరర్స్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు దిలీప్ గిరికి నేను రుణపడి ఉంటాను..ఆయనకు నా ధన్యవాదాలు అంటూ తెలిపారు సునీతి.

కాగా..ట్రినిడాడ్ అండ్ టొబాగో అనేది కరేబియన్‌లో దక్షిణాన ఉన్న ద్వీప దేశం. ప్రధాన ద్వీపాలైన ట్రినిడాడ్, టొబాగో లతో పాటు దేశంలో అనేక చిన్న ద్వీపాలు ఉన్నాయి.