Ms Dohni (2)
M.S.Dhoni: టీమిండియా మాజీసారథి మహేందర్ సింగ్ ధోనీ ఓ పాత కేసులో ఇరుక్కున్నారు. తనకు సంబంధం లేని కేసులో పోలీసులు ధోనీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చెక్ బౌన్స్ కేసులో ధోనీతో సహా మరో ఏడుగురిపై బీహార్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో బీహార్ కు చెందిన న్యూ ఇండియా గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా లిమిటెడ్ కు ప్రమోటర్ గా ధోనీ ఉన్నాడు. ఇదొక ఫర్టిలైజర్స్ ఉత్పత్తి చేసే సంస్థ.
2001లో ఎస్కే ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ న్యూ ఇండియా గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా లిమిటెడ్ నుంచి రూ. 30.86లక్షలు విలువ చేసే ఎరువులు కొనుగోలు చేసింది. న్యూ ఇండియా సంస్థ వాటిని డెలివరీ కూడా చేసింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఎరువుల్లో నాణ్యత లేదని డీలర్ ప్రొవైడర్ కు అనుగుణంగా లేవని, వాటిలో చాలా వరకు అమ్ముడుపోలేదని ఎస్కే ఎంటర్ ఫ్రైజెస్ ఆరోపించింది. దీంతో ధోనీ ప్రమోట్ చేసిన సంస్థ ఆ ఎరువులను వాపసు తీసుకొని రూ. 30లక్షల చెక్కును ఏజెన్సీకి అందజేసింది.
ఆ చెక్కును బ్యాంకులో వేయగా అది బౌన్స్ అయింది. దీంతో సదరు సంస్థ న్యూ ఇండియా గ్లోబల్ సంస్థకు ప్రమోటర్ గా ఉన్న ధోనీతో పాటు మరో ఏడుగురికి లీగల్ నోటీసులు పంపింది. తాజాగా వారి పేర్లను ఎఫ్ ఐ ఆర్ లో కూడా చేర్చింది. ఈ కేసును విన్న బెగుసరాయ్ కంజ్యూమర్స్ కోర్టు.. దీనిని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కు పంపింది. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 28న జరుగుతుంది.