Cat comes to Owner:15 రోజుల్లో 15 కిమీలు ప్రయాణించి యజమానిని చేరుకున్న పిల్లి

తనను వదిలేసిన యజమానిని వెతుక్కుంటూ ఒక పిల్లి 15 రోజుల పాటు ప్రయాణించి తిరిగి అతని వద్దకే చేరుకుంది. ఈఘటన తమిళనాడులోని విల్లుపురంలో చోటుచేసుకుంది.

Cat comes to Owner: ఒక్కసారి ప్రేమగా చూసుకోవాలేగాని జంతువులు మనుషులతో ఎంత అనుబంధాన్ని పెంచుకుంటాయో తెలిపే ఘటన ఇది. తనను వదిలేసిన యజమానిని వెతుక్కుంటూ ఒక పిల్లి ఏకంగా 15 రోజుల పాటు, 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తిరిగి అతని వద్దకే చేరుకుంది. ఈఘటన తమిళనాడులోని విల్లుపురంలో చోటుచేసుకుంది. విల్లుపురానికి చెందిన కెన్నెడీ అనే వ్యక్తి ఇంటికి.. కరోనా లాక్ డౌన్ సమయంలో ఒక పిల్లి పిల్ల వచ్చింది. 2020లో దేశ వ్యాప్తంగా కఠిన లాక్ డౌన్ ఉన్న సమయంలో మనుషులందరూ ఇళ్లకే పరిమితమైన సమయంలో ఆహారం దొరక్క కెన్నెడీ ఇంటికి వచ్చిన ఆ పిల్లి పిల్లను కెన్నెడీ కుటుంబ సభ్యులు బయటకు తరిమేశారు. అయినా తిరిగి తిరిగి వారి వద్దకే వస్తున్న ఆ పిల్లికి కొద్దిగా కొద్దిగా ఆహారం అందించారు. దీంతో కొన్ని రోజులకే అది వారింట్లో మనిషిలా కలిసిపోయింది. అలా రెండేళ్లలో ఆ పిల్లి వారికి ఎంతో దగ్గరైంది.

Also read: Viral News: అర్జెంటీనా జైల్లో ఖైదీని ముద్దాడిన మహిళా జడ్జి

అయితే దాని అరుపులను భరించలేని ఇరుగుపొరుగు వారు.. తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు. దాన్ని పంపించివేయాలంటూ కెన్నెడీ కుటుంబంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో వేరే దారిలేక ఆ పిల్లిని దూరంగా వదిలి రావాలని భావించాడు కెన్నెడీ. విల్లుపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలవనూరు గ్రామంలో పిల్లిని వదిలివచ్చాడు. అయితే పిల్లిని వదిలి ఉండలేని కెన్నెడీ మరుసటి రోజే దాని కోసం తిరిగి గ్రామానికి వెళ్ళాడు. అది అక్కడ లేకపోవడంతో ఉసూరుమంటూ ఇంటికి చేరుకున్నాడు. పిల్లి లేకపోవడంతో కెన్నెడీ కుటుంబ సభ్యులంతా ఎంతో బాధపడ్డారు.

Also read: Sony Earphones: సోనీ నుంచి తక్కువ ధరలో వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్

అయితే జనవరి 9న ఉదయం నిద్రలేచి బయటకు వచ్చిన కెన్నెడీకి.. ఇంటి వసారాలో పడుకుని ఉన్న పిల్లి కనిపించింది. దీంతో ఆ ఇంట్లోని వారందరు ఎంతో సంతోషంలో మునిగిపోయారు. దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో వదిలిన పిల్లి 15 రోజుల పాటు ప్రయాణించి ఇంటికి ఎలా చేరుకుందో అర్ధం కాక చుట్టుప్రక్కల వారు సైతం ఆశ్చర్యపోయారు. ఎంతో ప్రేమగా చూసుకున్న పిల్లి తిరిగి ఇంటికి చేరుకోవడంతో కెన్నెడీ కుటుంబ సభ్యులు తెగ సంబరపడిపోయారు. పిల్లిని ఇకపై వదిలేది లేదంటూ ఇరుగుపొరుగు వారికి తేల్చి చెప్పారు.

Also read: Mothers Love: తల్లికి మాటల్లో చెప్పలేని సంతోషాన్ని అందించిన కొడుకు

ట్రెండింగ్ వార్తలు