వీడియో: భార్యను దారుణంగా కొట్టిన పోలీస్ ఆఫీసర్.. ఉద్యోగం పోయింది

  • Publish Date - September 28, 2020 / 10:10 PM IST

నలుగురికి చెప్పే పొజిషన్‌లో ఉండే వ్యక్తులు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత పదవిలో ఉండి కూడా ఓ పోలీస్ సహనాన్ని కోల్పోయి భార్యను కిరాతకంగా కొట్టాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

ప్రజల రక్షణా బాధ్యతలను చూసుకునే పోలీసు రాష్ట్ర అధికారిగా ఉన్నత హోదాలో ఉండి తన భార్యను కొట్టి పదవిని పొగొట్టుకున్నారు. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్ కావ‌డంతో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌(MP)లో ఓ పోలీస్ ఉన్న‌తాధికారి విధుల నుంచి తొలగించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో పురుషోత్తం శ‌ర్మ (Purushottam sharma ) అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (ADG) ఆఫ్ పోలీస్‌గా సేవలందిస్తున్నారు. అయితే ఆయన త‌న భార్య‌ను కొడుతున్న వీడియో ఇటీవ‌ల‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావడంతో పురుషోత్తం శర్మ ఉద్యోగం నుంచి త‌ప్పుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.


అయితే పురుషోత్తం శర్మ తన భార్యను కొడుతుండగా.. ఆయన తనయుడు ఈ వీడియోను తీసి ట్విట్టర్ ద్వారా హోంమంత్రి, ఛీఫ్ సెక్రెటరీ, డిజిపికి పంపించి తండ్రిపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయనపై చర్య తీసుకుంది ప్రభుత్వం. అయితే ఈ ఘటనపై పురుషోత్తం శ‌ర్మ మాట్లాడుతూ.. తానేమీ నేర‌గాడిని కాద‌ని, అది త‌మ కుటుంబ గొడ‌వ అంటూ చెప్పారు. 32 ఏండ్ల క్రితం వివాహం జ‌రగ్గా.. తన భార్య 2008లో తనపై ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. అయితే అప్పటి నుంచి తనతోనే ఉంటుందని చెప్పారు.

భర్త వివాహేతర సంబంధాన్నిరెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నందుకు డీజీ.. భార్యపై ఎదురు దాడి చేసినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డీజీ పురుషోత్తం ఆగ్రహంతో ఊగిపోయి భార్యపై తీవ్రంగా దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పురుషోత్తం కుమారుడు పార్థ్‌ గౌతమ్(ఐఆర్ఎస్) ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.