Manipur : మణిపూర్ కేసులో ఆరుగురిపై సీబీఐ చార్జిషీట్

మణిపూర్‌లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ఆరుగురిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. మే నెలలో మణిపూర్‌లోని కంగ్‌పోక్పి జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి సీబీఐ సోమవారం ఆరుగురు వ్యక్తులు, ఒక బాలుడిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది....

CBI chargesheet

Manipur : మణిపూర్‌లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసులో ఆరుగురిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. మే నెలలో మణిపూర్‌లోని కంగ్‌పోక్పి జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి సీబీఐ సోమవారం ఆరుగురు వ్యక్తులు, ఒక బాలుడిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత దీని వీడియో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. 2023 మే 4 వతేదీన 1,000 మంది వ్యక్తులతో కూడిన గుంపు ఆయుధాలతో మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలోని బి ఫైనోమ్ గ్రామంలోకి ప్రవేశించి, ఇళ్లను ధ్వంసం చేశారు.

Also Read : Bihar : బీహార్ రాష్ట్రంలో మళ్లీ పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

గ్రామస్థులపై దాడి చేసి, హత్యలకు పాల్పడ్డారు. అనంతరం మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగికంగా వేధించారు. నగ్నంగా ఊరేగింపు చేసిన మహిళల్లో ఒకరు ఈ ఘటనలో మరణించారు. మణిపూర్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. సీబీఐ హుయిరుమ్ హెరోదాస్ తదితరులపై సోమవారం చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. సామూహిక అత్యాచారం, హత్య, మహిళలను కించపరచడం, నేరపూరిత కుట్ర వంటి నేరాల కింద అభియోగాలు మోపినట్లు సీబీఐ తెలిపింది.

Also Read : Maharashtra : మహారాష్ట్రలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్.. భయంతో జనం పరుగులు

ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుతో తలదించుకునేలా చేసిందని, చట్టం తన పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మణిపూర్ ఘటనపై కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాన్ని తక్షణమే చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కోరింది. మణిపూర్‌లో ఆ ఇద్దరు మహిళలను పరేడ్ చేసిన తీరుపై వెలువడ్డ వీడియోల వల్ల మేం తీవ్ర ఆందోళనకు గురయ్యాం అని న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు