CBI Case : మైనారిటీ స్కాలర్‌షిప్ స్కాంపై సీబీఐ కేసు

కేంద్ర మైనారిటీ స్కాలర్‌షిప్ కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. 2017-22వ సంవత్సరాల్లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో రూ.144 కోట్ల అక్రమాలు జరిగాయని తాజా విచారణలో వెల్లడైంది. మైనారిటీ స్కాలర్‌షిప్ కుంభకోణంలో 830 నకిలీ విద్యా సంస్థలు లబ్ధి పొందాయని తేలింది....

CBI Case

CBI Case : కేంద్ర మైనారిటీ స్కాలర్‌షిప్ కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. 2017-22వ సంవత్సరాల్లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో రూ.144 కోట్ల అక్రమాలు జరిగాయని తాజా విచారణలో వెల్లడైంది. మైనారిటీ స్కాలర్‌షిప్ కుంభకోణంలో 830 నకిలీ విద్యా సంస్థలు లబ్ధి పొందాయని తేలింది. (Minority Scholarship Scam) దీంతో నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, అవినీతి నిరోధక చట్టంలోని ఐపీసీ సెక్షన్ల కింద బ్యాంకులు, విద్యాసంస్థలు, ఇతరులకు చెందిన గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. (CBI Files Case)

Rice Export : సింగపూర్‌కు బియ్యం ఎగుమతికి భారత్ అనుమతి

స్కాలర్‌షిప్ స్కీమ్‌ల కింద నిధుల దుర్వినియోగంపై అందిన వివిధ నివేదికలను పరిగణనలోకి తీసుకుని స్కాలర్‌షిప్ స్కీమ్‌ల థర్డ్ పార్టీ మూల్యాంకనం నిర్వహించడానికి మంత్రిత్వ శాఖ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ని రంగంలోకి దింపింది. 21 రాష్ట్రాల్లో 830 నకిలీ విద్యాసంస్థలు లబ్ధి పొందాయని వెల్లడైంది. 2017-18 నుంచి 2021-22 సంవత్సరానికి ఆర్థికపరమైన అక్రమాల ద్వారా ఖజానాకు నష్టం వాటిల్లిందని మైనారిటీ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.

Chandrayaan-3 : చంద్రుడి‎పై ఆక్సిజన్..! 

నకిలీ స్కాలర్ షిప్ లతో ఖజానాకు రూ.144.33 కోట్ల నష్టం వాటిల్లింది. 830 నకిలీ విద్యాసంస్థలు ఈ కుంభకోణంలో ఉన్నాయని, దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిందని అధికారులు చెప్పారు. డిజిటలైజ్డ్ డేటా అందుబాటులో ఉన్న కాలంలో నష్టాన్ని గుర్తించగలిగామని, 2017-18కి ముందు కూడా కుంభకోణం జరగవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు