CBI Raids West Bengal Law Minister : బెంగాల్‌ న్యాయశాఖా మంత్రి నివాసాలపై సీబీఐ దాడులు

పశ్చిమబెంగాల్‌ లో మరో మంత్రి ఇంటిపై సీబీఐ దాడులు చేపట్టింది. బొగ్గు కుంభకోణం కేసులో బెంగాల్ న్యాయశాఖ మంత్రి మొలోయ్‌ ఘటక్‌ ఇళ్లపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహిస్తోంది. కోల్‌కతాలోని నాలుగు ప్రాంతాల్లో..అసన్‌సోల్‌లోని ఆయన ఇంట్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.

CBI Raids West Bengal Law Minister  : పశ్చిమబెంగాల్‌ లో మరో మంత్రి ఇంటిపై సీబీఐ దాడులు చేపట్టింది. బొగ్గు కుంభకోణం కేసులో బెంగాల్ న్యాయశాఖ మంత్రి మొలోయ్‌ ఘటక్‌ ఇళ్లపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహిస్తోంది. కోల్‌కతాలోని నాలుగు ప్రాంతాల్లో..అసన్‌సోల్‌లోని ఆయన ఇంట్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. బొగ్గు కుంభకోణంలో మొలోయ్‌పై ఆరోపణలు వచ్చిన క్రమంలో తనిఖీలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే మంత్రి మొలోయ్ ని ఈడీ అధికారులు ప్రశ్నించారు.

కాగా..బొగ్గు కుంభకోణంలో పార్టీ ప్రధాన కార్యదర్శి..దీదీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీని..ఆయన సతీమణి ఉజిరా నరులా బెనర్జీ, ఆమె సంబంధీకులను కూడాఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఇలా దీదీకి వరస షాకులు తగులుతున్న క్రమంలో మరో మంత్రి ఇంటిపై కూడా సీబీఐ దాడులు నిర్వహించటం సంచలనంగా మారింది.

కాగా మంత్రి మొలోయ్‌ ఘటక్‌ నివాసాలపై సోదాలు చేయటానికి సీబీఐ భారీ బలగంతో వచ్చింది. కోల్‌కతాలోని లేక్‌ గార్డెన్‌ ప్రాంతం, అసన్‌సోల్‌లోని మంత్రి నివాసాల్లో తనిఖీలు జరిపారు. ఇదే బొగ్గు కుంభకోణం కేసులో మరో నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఈ సోదాల అంశంపై సీబీఐ అధికారులు మాట్లాడుతూ ‘బొగ్గు కుంభకోణం కేసులో మొలోయ్ ఘటక్ పేరు కూడా వచ్చిన క్రమంలో వాస్తవాల కోసం ఈ దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఆయన పాత్ర ఉన్నట్లు మా వద్ద ఆధారాలున్నాయని అందుకే తనిఖీలు చేపట్టామని సీబీఐ అధికారి తెలిపారు.

ఈ మధ్యకాలంలో ఉపాధ్యాయుల నియామక కుంభకోణంలో బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అలాగే పశువుల అక్రమ రవాణా కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేత అనుబ్రతా మండల్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. కాగా..దర్యాప్తు సంస్థలను బీజేపీ కక్ష సాధింపు చర్యలకు వినియోగిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో ఇలా వరుసగా టీఎంసీ నేతల ఇళ్లపై దాడులు జరుగుతుండటం గమనించాల్సిన విషయం.

 

ట్రెండింగ్ వార్తలు