Cbse
CBSE 12th Results : సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. బాలికలు 94.54, బాలురు 91.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2022 విద్యాసంవత్సరానికి సంబంధించిన సీబీఎస్ఈ 12వ తరగతి తుది ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) శుక్రవారం(జులై22,2022) ఉదయం విడుదల చేసింది.
మొత్తం 14 లక్షల మంది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రాయగా 92.71 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 94.54 శాతం మంది అమ్మాయిలు ఉండగా, 91.25 శాతం మంది బాలురు ఉన్నారు. విద్యార్థులు తమ స్కోర్ కార్డులను cbse.gov.in, results.cbse.nic.in వెబ్‌సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Manchu Lakshmi : తెలంగాణాలో 50 స్కూళ్లని దత్తత తీసుకున్న మంచు లక్ష్మి
టర్మ్-1, టర్మ్-2 పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ మార్కులను సీబీఎస్‌ఈ విడుదల చేస్తుంది. టర్మ్-2 పరీక్షలను ఏప్రిల్ 26, జూన్ 4 మధ్య నిర్వహించింది. ఈ ఏడాది సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ పరీక్షలను 21 లక్షల మంది రాయగా, 12వ తరగతి పరీక్షలకు 14 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యహ్నం 2 గంటలకు సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల కానున్నాయి.