CDS Gen Chauhan
CDS Gen Chauhan : పాకిస్తాన్‌తో ఇటీవల సైనిక ఘర్షణలో భారత్ 6 యుద్ధ విమానాలను కోల్పోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
భారత యుద్ధ విమానాలను తామే కూల్చేశామంటూ పాకిస్తాన్ ప్రగాల్భాలు పలకడంతో మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. దీనికి సంబంధించిన ప్రశ్నలకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సరైన సమాధానమిచ్చారు.
Read Also : BSNL Plan : BSNL అదిరే ప్లాన్.. రోజుకు 3GB హైస్పీడ్ డేటా.. 90 రోజులు ఎంజాయ్ చేయొచ్చు..!
విమానాలను కోల్పోయిన తర్వాత భారత్ సరైన వ్యూహాలతో పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుని పోయి సమర్థవంతంగా ప్రతిదాడులు చేసిందని అనిల్ చౌహాన్ అన్నారు. 6 భారతీయ జెట్‌లను కూల్చివేశామన్న ఇస్లామాబాద్ వాదన పూర్తిగా తప్పు అంటూ ఆయన తోసిపుచ్చారు.
షాంగ్రి-లా డైలాగ్ 2025 కోసం చౌహాన్ సింగపూర్ పర్యటనకు వెళ్లగా అక్కడే బ్లూమ్‌బర్గ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పాక్ తో పోరాటంలో భారత్ అన్ని జెట్‌లను ప్రయోగించిందన్నారు. అయితే, పోరాటంలో నష్టాలు కూడా సహజమేనని ఆయన అన్నారు. ఈ నష్టానికి తగిన ప్రతీకారం తీర్చుకునేందుకు పాకిస్తాన్‌పై భారత్ విరుకుచుపడిందని చెప్పుకొచ్చారు.
నష్టం ఎంత అనేది చెప్పడానికి సీడీఎస్ జనరల్ నిరాకరించారు. కానీ, భారత సైన్యం పాక్ భూభాగంలోకి వెళ్లి మరి దాడి చేసిందని స్పష్టం చేశారు. దీని ఫలితంగానే శత్రుత్వాన్ని ఆపమని ఇస్లామాబాద్ విజ్ఞప్తి చేయాల్సి వచ్చిందన్నారు.
భారత యుద్ధ విమానం కూల్చివేతకు గురైందా? :
సైనిక ఘర్షణలో భారత యుద్ధ విమానం కూల్చివేతకు గురైందా అని చౌహాన్‌ను బ్లూమ్‌బర్గ్ ప్రశ్నించగా ఆయన ఒకే మాటలో సమాధానమిచ్చారు.
అసలు యుద్ధ విమానం కూలిందా లేదా అనేది విషయం కాదన్నారు. అలా ఎందుకు జరగాల్సి వచ్చిందనేది ముఖ్యమన్నారు. కనీసం ఒక యుద్ధ విమానమైనా పాక్ కూల్చేసిందా? అని మరోసారి ప్రశ్నించారు.
అందుకు ఆయన స్పందిస్తూ.. ‘అసలు విషయం ఏంటంటే.. మా వ్యూహాత్మక తప్పులను మేం గుర్తించాం. ఆపై వాటిని సరిదిద్దుకున్నాం. రెండు రోజుల తర్వాత సరికొత్త వ్యూహాలను అమలు చేసి జెట్లన్నింటినీ మోహరించాం.. సుదూర లక్ష్యాలను టార్గెట్ చేసినట్టు చౌహాన్ చెప్పుకొచ్చారు.
పాక్ వాదన పూర్తిగా తప్పు :
ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన పాక్ భారత్ యుద్ధ విమానాలను కూల్చివేసింది అనేది పూర్తిగా తప్పు అంటూ కొట్టిపారేశారు. అసలు యుద్ధ విమానాలు ఎందుకు కూలిపోయాయి.. ఆ తర్వాత ఎలా తిప్పికొట్టాం అనేది ముఖ్యమన్నారు.
భారత వైమానిక దళం వైమానిక ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ.. పోరాటంలో నష్టాలు ఒక భాగమన్నారు. అన్ని ఐఎఎఫ్ పైలట్లు సురక్షితంగా తిరిగి వచ్చాయని చెప్పారు.
జనరల్ చౌహాన్ వ్యాఖ్యలతో దేశంలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. డిఫెన్స్ ఎడిటర్ శశాంక్ జోషి మాట్లాడుతూ.. యుద్ధం జరిగిన మొదటి రాత్రి భారత్ యుద్ధ విమానాన్ని కోల్పోయి ఉండవచ్చు.
ఎందుకంటే ఆ సమయంలో తగిన ఆయుధాలు లేకపోవడం కారణం కావచ్చునని అన్నారు. పాశ్చాత్య దేశాధికారుల అంచనాల ఆధారంగా జోషి వ్యాఖ్యానించారు. నష్టాల మాదిరిగానే ప్రతిస్పందన కూడా అంతే ముఖ్యమని, ఈ విషయంలో చౌహాన్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని ఎక్స్ వేదికగా జోషి పేర్కొన్నారు.
మే 7న ఆపరేషన్ సిందూర్ :
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి వంటి లాంగ్ రేంజ్ ఆయుధాలను ఉపయోగించి పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న భూభాగాల్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ఈ దాడులతో 4 రోజుల పాటు తీవ్ర ఘర్షణలు జరిగాయి. మే 10న సైనిక చర్యలను ఆపడంపై అవగాహన ఒప్పందం కుదిరింది.
Read Also : PM KISAN : బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ రూ. 2వేలు పడేది అప్పుడే.. మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేయాలంటే?
భారత స్థావరాలను లక్ష్యంగా పాక్ ప్రయత్నించిన తర్వాత మే 10న భారత్ భారీ ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలోనే కీలకమైన పాకిస్తాన్ సైనిక స్థావరాలను నేలమట్టం చేసింది.
చౌహాన్ వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఘర్షణల్లో ఎలాంటి నష్టాలు సంభవించాయో నిజాయితీగా చెప్పాలని కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.