కేంద్ర బడ్జెట్ ప్రక్రియ చేపట్టడానికి రంగం సిద్ధమైంది. అధికారులు బిజీ బిజీగా అయిపోతున్నారు. 2020, ఫిబ్రవరి 01వ తేదీన పార్లమెంట్‌లో 2020 – 21 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన పత్రాల ముద్రణ స్టార్ట్ అయ్యింది. అయితే..ఈ ప్రక్రియ స్టార్ట్ చేయడానికంటే ముందు…సంప్రదాయబద్దంగా వస్తున్న హల్వా తయారు చేయడం ప్రారంభించారు.
2020, జనవరి 20వ తేదీ సోమవారం నార్త్ బ్లాక్‌లో ఆర్థిక శాఖ ప్రధాన కార్యాయలంలో హల్వా వేడుకల్లో పాల్గొన్నారు. పెద్ద కడాయిలో హల్వాను తయారు చేశారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, బడ్జెట్ తయారీలో పాల్గొనే అధికారులకు హల్వా రుచి చూపించారు. ఫిబ్రవరి 01వ తేదీ సోమవారం బడ్జెట్ లోక్ సభలో ప్రవేశపెట్టేంత వరకు అధికారులు ఆర్థిక మంత్రిత్వ శాఖ భవనంలోనే ఉంటారు.
అసలు ఎందుకు చేస్తారు
బడ్జెట్ రూపకల్పన ఎలా జరుగుతుందనే విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతారు. ఇందులో పాల్గొనే కీలక అధికారులు, సహాయ సిబ్బందికి ఆంక్షలుంటాయి. పని మొదలైనప్పటి నుంచి..పూర్తయ్యే వరకు కార్యాలయంలోనే ఉండాల్సి ఉంటుంది. వీరికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవు. కుటుంబసభ్యలుతో కూడా మాట్లాడనీయరు. పోన్, ఈమెయిల్ అందుబాటులో ఉండవు. ఎవరితో సంప్రదింపులు వీలుండదు.
ఆఫీసు లోపలకు బయటి వ్యక్తులకు నో ఎంట్రీ. బడ్జెట్ పూర్తిగా అయిపోయిన తర్వాత తలుపులు తెరుస్తారు. ముద్రణకు పంపే ముందు…హల్వా తయారు చేయడం సంప్రదాయంగా వస్తోంది. పెద్ద ముకుడులో దీనిని తయారు చేస్తారు. కేంద్ర ఆర్థిక శాఖ సిబ్బంది పనిలో నిమగ్నం కావడానికి కంటే ముందు..వారికి తీపి తినిపించాలనే ఉద్దేశ్యంతో హల్వా తయారు చేస్తారు. ఇది ఆచారంగా వస్తోంది. హల్వా తయారీతో బడ్జెట్ ప్రతుల ముద్రణ ప్రారంభిస్తారు.
1950 వరకు బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతి భవన్‌లో ముద్రించే వారు. కానీ..అక్కడ బయటకు పత్రాలు బయటకొచ్చాయి. దీంతో మింట్ రోడ్డులోని గవర్నమెంట్ ప్రెస్‌కు మార్చారు. అనంతరం 1980లో నార్త్ బ్లాక్‌లోని బేస్ మెంట్‌కు మార్చారు. అప్పటి నుంచే ఇక్కడే కొనసాగుతోంది.
Read More : తప్పులు చేయం : 300 సంవత్సరాలు వరకు సంతోషంగా ఉండాలి