బీజేపీకి ఓటేయమని బలగాలు బలవంతపెట్టాయి

  • Publish Date - April 23, 2019 / 01:59 PM IST

మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. పశ్చిమబంగా రాష్ట్రంలో కూడా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. ఇదిలా ఉంటే బీజేపీకి ఓట్లు వేయాలంటూ సెక్యురిటీ కోసం వచ్చిన కేం‍ద్ర బలగాలు ఓటర్లను అడుగుతున్నారని పశ్చిమబంగా ముఖ్యమం‍త్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి ఓటు వేయాలని మల్ధాహదక్షిణ్‌, బలూర్‌ఘాట్‌ నియోజకవర్గాల్లోని ఓటర్లను కేంద్ర బలగాలు బలవంతపెట్టాయని ఆమె ఆరోపించారు. ఈ విషయమై తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈసీకి సమాచారం అందజేసినట్లు మమతా బెనర్జీ వెల్లడించింది.
Also Read : చలో వారణాసి: మోడీకి గురిపెట్టిన తెలంగాణ రైతులు

పోలింగ్ కేంద్రాల్లో తిష్టవేసి బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నట్టు తన దృష్టికి వచ్చినట్లు దీదీ మమతా చెప్పారు. పోలింగ్ కేంద్రాలు లోపల కేంద్ర బలగాలకు పనేంటని ఆమె ప్రశ్నించారు. కేంద్ర బలగాలను బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని ఆమె ఆరోపించారు. 2016లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇదేవిధంగా వ్యవహరించిందని ఇప్పుడు కూడా బీజేపీ అలాగే వ్యవహరించిందని, అప్పుడు బుద్ధి చెప్పినట్లే బెంగాల్‌ ప్రజలు బీజేపీకి ఇప్పుడు బుద్ధి చెబుతారాని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 
Also Read : జనసేన ఆఫీసులకు టూలెట్ బోర్డులు: స్పందించిన పవన్ కళ్యాణ్

ట్రెండింగ్ వార్తలు