Colonel Santosh Babu : కల్నల్ సంతోష్ బాబుకు ‘మహావీర్ చక్ర’ పురస్కారం

దివంగత కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర అవార్డు లభించింది. తెలంగాణలోని సూర్యాపేట పట్టణానికి చెందిన సంతోష్ బాబు 2020 జూన్ 15న గాల్వాన్‌లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో వీరమరణం చెందారు

Colonel Santosh Babu :  దివంగత కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర అవార్డు లభించింది. తెలంగాణలోని సూర్యాపేట పట్టణానికి చెందిన సంతోష్ బాబు 2020 జూన్ 15న గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందారు. ఆ ఘటనలో సంతోష్‌తో సహా 21 మంది సోల్జర్లు వీరమరణం పొందారు. సంతోష్ బాబు మరణానంతరం కేంద్రప్రభుత్వం ఆయనకు మహావీర్ చక్ర పురస్కారం ప్రకటించింది. మంగళవారం సంతోష్ బాబు భార్య, ఆయన తల్లి.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు.

చదవండి : Santhosh Babu : మోటివేషనల్‌ హాల్‌కు కల్నల్ సంతోష్‌ బాబు పేరు

ఇక ఉగ్రస్థావరాలపై దాడి చేసి 300 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టి పాకిస్తాన్ సైన్యానికి చిక్కి.. తిరిగి స్వదేశానికి వచ్చిన అభినందన్ వర్ధమాన్‌కు కేంద్ర ప్రభుత్వం వీర్ చక్ర పురస్కారం ప్రధానం చేసింది. ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా సోమవారం అభినందన్ కుటుంబ సభ్యులు అందుకున్నారు.

చదవండి : Colonel Santhosh Babu: కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణం – కేటీఆర్

ట్రెండింగ్ వార్తలు