Central Government Negligence Is To Blame For The Corona Boom International General The Lancet
Central government negligence : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణపై వస్తున్న పలు నివేదికలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. తాజాగా దేశంలో కరోనా పరిస్థితులపై ప్రముఖ అంతర్జాతీయ జనరల్ ది లాన్సెట్ సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా కారణంగా ఇండియాలో ఆగస్టు 1నాటికి 10 లక్షల మరణాలు నమోదు అవుతాయంటూ అంచనా వేసింది. మే 4 నాటికి దేశంలో నమోదైన 2 కోట్లకు పైగా కరోనా కేసులు సంభవిస్తున్న మరణాలను గుర్తుచేసింది లాన్సెట్.
సరైన నియంత్రణ చర్యలు తీసుకోకపోతే ఆగస్టు 1 నాటికి 10 లక్షల సంభవిస్తాయని ఇన్సిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యువేషన్ అంచనా వేసింది లాన్సెట్. ఒకవేళ ఇదే జరిగితే జాతీయ విపత్తులో కేంద్రంలోని మోడీ సర్కారే బాధ్యత వహించాలని తెలిపింది. అంతేకాదు, ఈ సంక్షోభ సమయంలో విమర్శలను తొక్కిపెట్టడానికి ప్రయత్నించిన తీరు క్షమించరానిదంది లాన్సెట్.
ఇక భారతదేశంలో కోవిడ్-19 అత్యవసర పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఒకపక్క బాధితులతో ఆస్పత్రులన్నీ నిండిపోతున్నాయి. మరోపక్క మందులు, బెడ్లు, ఆక్సిజన్లు అందక రోగులు అష్టకష్టాలు పడుతున్నారంది. చివరికి చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అసలు కోవిడ్ నియంత్రణకు మోడీ సర్కార్ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని మండిపడింది.
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందంటూ లాన్సెట్ విమర్శలకు వచ్చింది. ఈ సమయంలో భారత్ సాధించిన విజయాల పట్ల కాకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మేల్కొనాలని బాధ్యతాయుతమైన న్యాయకత్వం, పారదర్శకతతో కూడిన పాలనను అందించాలని కోరింది. ఇప్పటికైనా ఇండియా వ్యాక్సినేషన్ పెంచాలని కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు టీకాలు అందించాలని తెలిపింది.
కరోనా మహమ్మారి విస్తరణను నిలువరించేందుకు దేశ వ్యాప్త లాక్ డౌన్ సహా టీకా, మాస్క్, భౌతిక దూరం, స్వచ్ఛంద నిర్బంధం, పరీక్షల ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది.