organ donation
organ donation : అవయవదానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన 42 రోజుల ప్రత్యేక సెలవులను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అవయవదానం అనేది ఎంత గొప్పదో అవయవాల తొలగింపు శస్త్ర చికిత్సలు అతి పెద్దవి. ఇటువంటి శస్త్ర చికిత్సలు జరిగితే వారు కోలుకోవటానికి సమయం పడుతుంది. ఇది చాలా అవసరం కూడా. అందుకే అవయవదానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రభుత్వం మార్చి 24న ‘వన్ నేషన్ వన్ డొనేషన్’విధానాన్ని ఆమోదించింది.
ఎవరైనా దాత అవయవదానం కోసం చేయించుకునే సర్జరీ నుంచి కోలుకునేందుకు మరింత సమయం అవసరమని..అందుకోసమే స్పెషల్ క్యాజువల్ లీవ్‌లను పెంచామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే అవయదానం చేసిన దాత ఎటువంటి సర్జీలు చేయించుకున్నా వారు ప్రభుత్వ గుర్తింపు పొందిన వైద్యుడి సూచన మేరకు సెలవులు తీసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఈ సెలవులు వారి వారి అవసరాలను బట్టి..వీలును బట్టి ఒకేసారి తీసుకోవచ్చు. లేదా విడతల వారీగా గానీ ఈ సెలవులను ఉపయోగించుకునే వెలుసుబాటును కల్పించింది ప్రభుత్వం.
“మరో వ్యక్తికి సహాయం చేయడానికి..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో అవయవ దానాన్ని ప్రోత్సహించడానికి కార్యాచరణను దృష్టిలో ఉంచుకుని..వారి అవయవ (ల)ను దానం చేసినందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి గరిష్టంగా 42 రోజుల ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేయాలని నిర్ణయించబడింది. కాగా భారతదేశంలో దాదాపు 4.2 మిలియన్ల మంద్రి కేంద్ర ఉద్యోగులు ఉన్నారు.నేషనల్ ఆర్గాన్ మరియు టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ కు ఉన్న సమాచారం ప్రకారం 2019, 2020, 2021లో కిడ్నీ మార్పిడులు 8,25,44, 970లు జరిగినట్లుగా తెలుస్తోంది.