special festival advance for government employees కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ తీపికబురు అందించింది. కరోనా దెబ్బతో మందగించిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు నిర్ణయించిన కేంద్రం… లీవ్ ట్రావెల్ కన్సీషన్ (LTC) క్యాష్ వోచర్,స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ వీటికి సంబంధించిన ప్రకటన చేశారు.
నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ…కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందని, పేదల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రకటించిందని, కొంత వరకు అవరోధాలు తీరినా.. కానీ వినియోగదారుడికి మరింత బూస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కన్సూమర్ స్పెండింగ్(వినియోగదారుడి ఖర్చు) పెంచే విధంగా కొన్ని ప్రతిపాదనలను డిజైన్ చేసినట్లు ఆర్థికమంత్రి చెప్పారు. ఇందులో భాగంగానే ఎల్‌టీసీ క్యాష్ వోచర్, స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ లను తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు.
ట్రావెల్ క్యాష్ వోచర్ స్కీమ్‌తో ప్రభుత్వ ఉద్యోగులు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద డబ్బులు పొందొచ్చు. ఇవి ఓచర్ల రూపంలో లభిస్తాయి. టికెట్ ధరకు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ప్రేవేటు ఉద్యోగులకు కూడా LTC వర్తిస్తుందని నిర్మలా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నాలుగేళ్లలో ఒకసారి ఎల్‌టీసీ పొందొచ్చు. ఈ నగదును 12 శాతం ఆపై జీఎస్టీ విధించే వస్తువులపై ఖర్చు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. వాటిని కూడా డిజిటల్ మాధ్యమం ద్వారా వెచ్చించాలన్నారు. వీటికి సంబంధించి జీఎస్టీ ఇన్వాయిస్ సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. దేశంలో తమకు నచ్చిన ప్రాంతానికి ఒకసారి,స్వస్థలానికి ఒకసారి లేదా రెండుసార్లు తమ సొంత ఊరికి వెళ్లేందుకు ఎల్టీసీ సదుపాయం అందుబాటులో ఉందని తెలిపారు. వీటిపై ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదని స్పష్టం చేశారు.
విహారయాత్రలు లేదా సొంత ఊళ్లకు వెళ్లేందుకు కేంద్రం నాలుగేళ్లకు ఓసారి ఉద్యోగులకు ఇస్తుంది. ఈసారి ప్రయాణాలు కష్టమైన నేపథ్యంలో ఉద్యోగులు వాటిని ఉపయోగించుకొని కన్సెషన్ లేదా డిస్కౌంట్ పొందలేకపోయారు. దీంతో డిమాండ్ పెంచే ఉద్దేశ్యంలో భాగంగా ఎల్టీసీలను నగదు ఓచర్ల రూపంలోకి మార్చింది కేంద్రం. దీంతో ఉద్యోగులు ఫేర్ కంటే మూడు రెట్ల వస్తువులు/సేవలు కొనుగోలు చేయవచ్చు. వీటిని ఉద్యోగులు 2021 మార్చి 31వ తేదీ వరకు వినియోగించుకోవచ్చు.
ఇకపోతే,నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్‌ను అమలు చేయనున్నారు. ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రూ.10,000 ఎలాంటి వడ్డీ లేకుండా ముందుగానే అడ్వాన్స్ కింద పొందొచ్చు. ప్రీపెయిడ్ రూపేకార్డు రూపంలో ఆ అమౌంట్ ఇస్తారు. పండుగ వేళ ఉద్యోగులు ఈ మొత్తాన్ని ఖర్చు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది 31వ తేదీలోగా ఆ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. పది ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో ఈ రూ.10 వేలు చెల్లించాలి.
Special Festival Advance Scheme for non-gazetted employees is being revived as a one-time measure, for gazetted employees too
All central govt. employees can now get interest-free advance of Rs. 10,000, in the form of a prepaid RuPay Card, to be spent by March 31, 2021 – FM pic.twitter.com/uvbcgm66iI
— Prasar Bharati News Services (@PBNS_India) October 12, 2020