Union Cabinet: దీపావళికి ముందు కేంద్ర ఉద్యోగులకు, రైతులకు గుడ్ న్యూస్ చెప్పి మోదీ ప్రభుత్వం

లధాఖ్ లో 7.5 గిగావాట్ల సోలార్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ 15 ఆగస్టు 2020న ఎర్రకోట నుంచి ప్రకటించారు. నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ దిశలో 13 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించారు

Union Cabinet Hike DA: దీపావళి, దుర్గాపూజలకు ముందు కేంద్ర ఉద్యోగులు, రైతులకు మోదీ ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. కరువు భత్యాన్ని 4 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జూలై 1, 2023 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్(డీఏ), పెన్షనర్ల డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)ని 4 శాతం పెంచాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. తాజా పెంపుతో 42 శాతం నుంచి 46 శాతానికి పెరిగింది. అలాగే రైల్వే ఉద్యోగులకు బోనస్ ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రైల్వేలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల జీతంతో సమానంగా బోనస్ ఇస్తామని కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

అదే సమయంలో ఆరు రబీ పంటలకు ఎంఎస్‌పీని పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నూనె గింజలు, ఆవాలు క్వింటాలుకు రూ.200 పెంచారు. ముతక ధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. కందులు క్వింటాల్‌కు రూ.425, గోధుమలు క్వింటాల్‌కు రూ.150, బార్లీ క్వింటాల్‌కు రూ.115, మినుము క్వింటాల్‌కు రూ.105 చొప్పున పెంచినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Israel Palestine Conflict: గాజా ఆసుపత్రి దాడిపై ప్రధాని మోదీ విచారం.. దోషుల్ని విడిచిపెట్టొద్దంటూ హెచ్చరిక

నాల్గవ నిర్ణయం లధాఖ్ ప్రాంతానికి చెందినదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “లధాఖ్ లో 7.5 గిగావాట్ల సోలార్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ 15 ఆగస్టు 2020న ఎర్రకోట నుంచి ప్రకటించారు. నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ దిశలో 13 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించారు. దానితో అనుసంధానం చేస్తూ లధాఖ్ లో సోలార్ పార్క్ ఆవిష్కృతం అవుతుంది’’ అని అన్నారు. 

ట్రెండింగ్ వార్తలు