×
Ad

COVID కేర్ సెంటర్‌గా అజ్మీర్ షరీఫ్ దర్గా రెస్ట్ హౌస్‌..

అజ్మీర్ షరీఫ్ దర్గా విశ్రాంతి గృహాన్ని తాత్కాలిక కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చాలనే ప్రతిపాదనకు మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆమోదం తెలిపారు.

Ajmer Sharif Dargah Rest House (1)

Ajmer Sharif Dargah Rest House : అజ్మీర్ షరీఫ్ దర్గా విశ్రాంతి గృహాన్ని తాత్కాలిక కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చాలనే ప్రతిపాదనకు మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆమోదం తెలిపారు. విశ్రాంతి గృహాన్ని కరోనా కేర్ సెంటర్‌గా మార్చాలని దర్గా కమిటీ అధ్యక్షుడు అమిన్ పఠాన్ అభ్యర్థన చేశారు.

COVID-19 మహమ్మారి సమయంలో, దేశంలోని ప్రతి సంస్థ నైతిక, మానవతా విధితో ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం పూర్తి సహకారాన్ని అందించాలని కోరారు. అజ్మీర్ దర్గా విశ్రాంతి గృహాన్ని కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చాలని ప్రతిపాదించారు. ఆమోదించిన మంత్రి, కరోనావైరస్‌పై పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వంతో పూర్తిగా సహకరించాలని దర్గా కమిటీ, ప్రజలను కోరారు.

COVID-19 రోగులకు తాత్కాలిక సంరక్షణ కేంద్రాలుగా ఉపయోగించుకోవడానికి హజ్ హౌస్‌లను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని సోమవారం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని హజ్ హౌస్‌లను తాత్కాలిక ‘కరోనా కేర్ సెంటర్’గా ఉపయోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని నిర్ణయించారని నఖ్వీ తెలిపారు.