Agnipath : ‘అగ్నివీర్’లకు కేంద్ర పోలీసు బలగాల్లో 10% రిజర్వేషన్స్.. కేంద్ర హోమ్ శాఖ కీలక ప్రకటన

అగ్నిపథ్ కింద రిక్రూట్ చేసుకున్న ‘అగ్నివీర్’లకు కేంద్ర పోలీసు బలగాల్లో 10% రిజర్వేషన్స్ అంటూ కేంద్ర హోమ్ శాఖ కీలక ప్రకటన చేసింది.

Agnipath :  ఆర్మీలో రిక్రూట్ మెంట్ కోసం కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకం పేరుతో త్రివిధ దళాల్లో నాలుగేళ్ల ఉద్యోగ పథకంపై.. దేశవ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి తీవ్ర ఆందోళన, హింసాత్మక చర్యలు ఎదురవుతున్న క్రమంలో కేంద్రం హోమ్ శాక మరో కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే అగ్నిపత్ పథకానికి వయోపరిమితి ప్రకటించిన కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. అగ్నిపథ్ పథకం కింద ‘అగ్నివీర్’గా దేశానికి సేవలు అందించిన వారికి కేంద్ర పోలీసు బలగాల్లో (Central Reserve Police Force)10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని కీలక ప్రకటన చేసింది. కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించిన వివరాలను శనివారం (18,2022) విడుదల చేసింది.

Also read : Agnipath: సికింద్రాబాద్ ఘటన వెనుక కుట్ర కోణం.. పోలీసుల అనుమానం

అగ్నివీర్ ఉద్యోగానికి తొలుత 17.5-21 ఏళ్ల వరకు వయసున్న వారు అర్హులని ప్రకటించింది. ఆ తరువాత నిరసనలు కొనసాగుతున్న క్రమంలో దీనికి వయోపరిమితిని పెంచుతున్నట్లుగా ప్రకటించింది. అయినా నిరసనల విధ్వంసం కొనసాగుతునే ఉంది. నాలుగేళ్లు మాత్రమే ఉద్యోగంలో కొనసాగిన తరువాత వారు తరువాత ఏం చేయాలి? వారి భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నలు దేశంలో యువతకు తీవ్ర నిరాశ కలిగించింది. దీంతో భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలు చెందిన యవత సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు.

ఈక్రమంలో తాజాగా కేంద్రహోం శాఖ అగ్నివీరులుగా దేశానికి నాలుగేళ్లు సేవ చేసి..తెలిసిందే. ఇలా ఎంపికై అగ్నివీర్ గా నాలుగేళ్లు పనిచేసి దిగిపోయిన తర్వాత.. త్రివిధ దళాల్లోనే రెగ్యులర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటించింది. వీరి కోసం 25 శాతం కోటాను కేంద్రం ముందే ప్రకటించింది. దీనికి అదనంగా ఇప్పుడు కేంద్ర ఆర్మ్ డ్ పోలీసు ఫోర్స్ లు (సీఏపీఎఫ్), అస్సామ్ రైఫిల్స్ లో ఉద్యోగాల్లో వీరికి 10 శాతం కోటాను కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.

Also read : Agnipath: అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని మోదీ ఉప‌సంహ‌రించుకుంటారు: రాహుల్ గాంధీ

నాలుగేళ్లు పనిచేసిన తర్వాత కేంద్ర పోలీసు బలగాల్లో ఉద్యోగాలకు అర్హత సంపాదించుకునేందుకు వీలుగా వయోపరిమితిలోనూ మూడేళ్లకు పెంచారు. (అదికూడా ఈ ఏడాదికి మాత్రమే). సాధారణ అభ్యర్థులకు ఉండే గరిష్ఠ వయోపరిమితికి అదనంగా మూడేళ్లపాటు వీరు పోటీ పడొచ్చు. మొదటి బ్యాచ్ అగ్నివీర్ అభ్యర్థులకు ఐదేళ్లపాటు వయోపరిమితి సడలింపు ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగులుగా మార్చే అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తం అవుతుండడంతో వారిని శాంతింపజేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

కాగా అగ్నిపథ్ పై నిరసనలు మొదటి ఉత్తరభారతంలో మొదలై మరునాటికల్లా తెలంగాణకు చేరాయి. ఈ నిరసనల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను నిరసనకారులు రక్తసిక్తం చేశారు. రైళ్లను నిప్పు పెట్టారు.కంటికి కనిపించినవల్లా కాల్చి బూడిద చేశారు. దీంతో పోలీసులు కాల్పులు జరుపగా ఈ ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా యువత వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్న తరుణంలో బీహార్‌లోని జెహనాబాద్‌లో మూడవరోజుకూడా నిరసనకారులు బస్సులు, ట్రక్కులకు నిప్పు పెట్టారు. ప్రస్తుతం ఈ పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పలు జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. దీనితో పాటు ఇంటర్నెట్‌ను కూడా నిలిపివేయాలని నిర్ణయించారు.

ట్రెండింగ్ వార్తలు