Rahul On Booster Dose : దేశంలో బూస్టర్ డోస్..తాను చెప్పినట్లే కేంద్రం చేసిందన్న రాహుల్

కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న సమయంలో దేశ ప్రజలకు బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

Rahul On Booster Dose : కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న సమయంలో దేశ ప్రజలకు బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు.

ఈ మేరకు ఆదివారం చేసిన ఓ ట్వీట్ లో రాహుల్…”బూస్టర్ డోసు విషయంలో నేను ఇచ్చిన సలహాలను కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది. ఇది సరైన ముందడుగు. దేశంలో ప్రతి పౌరుడికీ కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు రక్షణ లభించాలి”అని పేర్కొన్నారు. ఈ ట్వీట్​కు డిసెంబర్ 22న చేసిన తన ట్వీట్​ను రాహుల్ జోడించారు. దేశంలోని మెజారిటీ జనాభాకు వ్యాక్సిన్లు దక్కలేదని, బూస్టర్ డోసులు ఎప్పుడు ప్రారంభిస్తారని ఆ ట్వీట్​లో ప్రభుత్వాన్ని రాహుల్ ప్రశ్నించారు.

కాగా,శనివారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. హెల్త్​కేర్, ఫ్రంట్​లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు అందించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. జనవరి 10 నుంచి ‘ప్రికాషన్ డోసు’ పేరుతో వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ALSO READ Siddipet District : అనుమానంతో భార్యపై వేధింపులు-కుమారుడితో సహ తల్లి ఆత్మహత్య

ట్రెండింగ్ వార్తలు