CT Scans Cause Cancer : సిటీ స్కాన్‌తో క్యాన్సర్ వచ్చే ప్రమాదం

CT scan : సిటీ స్కాన్‌తో క్యాన్సర్‌ వచ్చే అవకాశాలున్నాయని ఎయిమ్స్‌ చీఫ్‌ గులేరియా ఎయిమ్స్ డాక్టర్ రణదీప్ గులేరియా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన సిటీ స్కాన్ అవసరం లేదని చెప్పారు. కోవిడ్ లక్షణాలు లేని వారికి సిటీ స్కాన్ అవసరం లేదని స్పష్టం చేశారు.

ఒక్క సీటీ స్కాన్‌ తీస్తే 300-400 ఎక్స్‌రేలు తీసినట్లు ఉంటుందన్నారు. సిటీ స్కాన్ ఎక్కువగా చేసుకుంటే రేడియేషన్ వల్ల కాన్సర్ రావచ్చన్నారు. చెస్ట్ ఎక్స్‌రే తీసుకున్న తరువాత ఇబ్బందిగా ఉంటేనే సిటీ స్కాన్ చేసుకోవాలని తెలిపారు

యుక్తవయస్సులో ఉండగా సిటీ స్కాన్ చేయించుకుంటే భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చి తక్కువ లక్షణాలు ఉన్నావారు హోమ్ ఐసోలేషన్ లో ఉండి దాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు. పాజిటివ్ వచ్చిన వారంతా సిటీ స్కాన్ తీయించుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

పైగా సిటీస్కాన్ఎక్కువ ఖర్చతో కూడకున్నవ్యవహారం అని ఆయన అన్నారు. అలాగే వైద్యుల సూచనల మేరకే రోగులు మందులు వాడాలని… మధ్యస్ధ లక్షణాలు ఉన్నవారు అనవసరంగా మందులు తీసుకుంటే ప్రమాదంలోపడే అవకాశం ఉందని ఆయన వివరించారు.కరోనా కట్టడికి సంబంధించి ఏరకంగా మందులు వాడాలి….ఎప్పడు ఆస్పత్రికి వెళ్లాలనేది వెబినార్ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నామని గులేరియా అన్నారు.

వ్యాక్సిన్ పట్ల అపోహలు మాని ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుంటే దేశంలోకరోనా కేసులు తగ్గుముఖం పడతాయని… అవసరమైన వారికి బెడ్లు, ఆక్సిజన్ అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు