Minister (1)
Chandira Priyanga Woman Minister: దాదాపు రెండు నెలలు కావస్తున్న సమయంలో రాష్ట్ర మంత్రి వర్గం జాబితాను సిద్ధం చేసింది పుదుచ్చేరిలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్‌ఆర్ కాంగ్రెస్. ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, సీఎం రంగస్వామి ఎట్టకేలకు మంత్రివర్గం జాబితాను గవర్నర్ ఎల్జీ తమిళిసై సౌందరరాజన్‌కు అందజేశారు. ఈమేరకు రూపొందించిన లిస్ట్‌కు కేంద్రం ఆమోదముద్ర వేసింది.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 40ఏళ్ల తర్వాత ఓ మహిళకు మంత్రి పదవి దక్కింది. 1980-1983లో కాంగ్రెస్-డీఎంకే కూటమి మంత్రివర్గంలో డీఎంకేకు చెందిన రేణుకఅప్పాదురై మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మహిళలకు మంత్రి పదవులు దక్కలేదు. లేటెస్ట్‌గా ఇప్పుడు 40ఏళ్ల తర్వాత రంగస్వామి కేబినెట్‌లో కారైక్కాల్ ప్రాంతంలో నెడుంగాడు రిజర్వుడు స్థానం నుంచి గెలిచిన ఎన్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన చందిరా ప్రియాంగాకు మంత్రి పదవి దక్కింది.
ఇవాళ(27 జూన్ 2021) ఆదివారం సాయంత్రం 3 గంటలకు మంత్రుల ప్రమాణస్వీకారం రాజ్ నివాస్‌లో జరగబోతుంది. బీజేపీకి చెందిన నమశ్శివాయం, సాయి శరవణన్ కుమార్, ఎన్‌ఆర్ కాంగ్రెస్‌కు చెందిన లక్ష్మినారాయణన్, తేని జయకుమార్‌లకు మంత్రి పదవులు దక్కాయి. పదిహేను నిమిషాల్లో ప్రమాణ స్వీకారం ముగిసేలా రాజ్ నివాస్‌లో ఏర్పాట్లు చేశారు అధికారులు. కోవిడ్ కారణంగా వంద మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు అధికారులు.