CM Mamata Banerjee : చంద్రబాబు అరెస్టుపై సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు అరెస్టుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

mamata banerjee..chandrababu

Mamata Banerjee On Chandrababu Naidu arrest : స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ చేసిన తీరు సరైంది కాదు అంటూ ఏపీ కమ్యూనిస్టులతో పాటు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా స్పందించారు.

చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపులా ఉందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు సరికాదన్నారు. టీడీపీ హయాంలో ఏదైనా తప్పు జరిగితే పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు. అంతేతప్ప కక్షపూరితంగా వ్యవహరించటం సరికాదన్నారు.

Chandrababu : చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఏపీ ప్రభుత్వం మరో పిటిషన్

అరెస్టు తరువాత చంద్రబాబు విడుదల అవుతారని టీడీపీ శ్రేణులు, వారి కుటుంబ సభ్యులు భావించారు కూడా అనూహ్యంగా ఏసీబీ కోర్టు చంద్రబాబు రిమాండ్ విధించటంతో ఆశ్చర్యపోయారు. దీంతో ఆయనకు హౌస్ అరెస్ట్ అనుమతి ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టులో పిటీషన్ వేయగా దానికి కౌంటర్ గా సీఐడీ కూడా పిటీషన్ దాఖలుచేసింది. తాము అరెస్ట్ చేసిన సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారని..తాము ఆయన్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయటంలేదని ఆయన బాగానే ఉన్నారని..ఈ కేసులో ఆయన్ని పలు అంశాలపై విచారించాల్సిన అసవరం ఉందని సీబీఐ కోర్టుకు వెల్లడించింది.