Chandrayaan 3: జాబిల్లిపై భారత్ ముద్ర.. దేశ ప్రజలందరూ చప్పట్లు కొట్టిన వేళ.. భావోద్వేగభరిత క్షణాలు
చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా నిలిచింది. భారత్ సత్తా అంటే ఇది..

Chandrayaan 3 – Moon south pole: చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయింది. లానార్ డే (14 రోజులు) ముగిసేలోపు రోవర్, ల్యాండర్ సమాచారాన్ని పంపిస్తాయి. రెండు వారాల పాటు అవి చంద్రుడి ఉపరితలంపై తిరుగుతాయి.
ప్రయోగం సఫలం కావడంతో చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ఇంతకు ముందు అమెరికా, రష్యా, చైనా సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా నిలిచింది. భారత్ సత్తా అంటే ఇది అని ప్రపంచం గుర్తించింది. భారత్ శాస్త్రవేత్తలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
రోవర్ ప్రజ్ఞాన్, ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై దిగాక మొదట ల్యాండర్ లోని ఒకవైపు ప్యానెల్ తెరుచుకుంటుంది. ఆరు చక్రాలు ఉండే రోవర్ బయటకు రావడానికి వీలుగా ర్యాంప్ ఏర్పడుతుంది. నాలుగు గంటల తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వస్తుంది.
రోవర్ ప్రజ్ఞాన్‌లో భారత జాతీయ పతాకం, అలాగే, ప్రజ్ఞాన్ చక్రాలపై ఇస్రో లోగోలను ముద్రించారు. ఒక్క క్షణానికి ఒక సెంటీమీటర్ వేగం చొప్పున అది ముందుకు వెళ్తూ అక్కడి పరిసరాలను నేవిగేషన్ కెమెరాల ద్వారా స్కాన్ చేస్తుంది. రోవర్ కదుతున్న సమయంలో చంద్రుడి ఉపరితలంపై భారత జాతీయ పతాకం, ఇస్రో లోగోల ముద్రలు పడతాయి.
LIVE: Chandrayaan-3 Mission Soft-landing.https://t.co/amw5DMsxfe
— Kanaiyalal Kishori (@KBKishori) August 23, 2023
Chandrayaan-3 Mission Soft-landing LIVE Telecast
Source: ISRO Official, YouTube Channel pic.twitter.com/hlWDnXjUcn
— Saurabh Kumar (@Saurabh66778711) August 23, 2023
#WATCH | ISRO chief S Somanath congratulates his team on the success of the Chandrayaan-3 mission pic.twitter.com/ZD672osVFf
— ANI (@ANI) August 23, 2023
#WATCH | Uttar Pradesh Chief Minister Yogi Adityanath in Lucknow watches the landing event of Chandrayaan-3 on the moon.
ISRO’s third Lunar Mission made a successful landing on the south pole of the moon. pic.twitter.com/f08aojFLDI
— ANI (@ANI) August 23, 2023
Chandrayaan 3: అగ్రదేశాలు చంద్రుడి దక్షిణ ధ్రువంపైకే ఎందుకు వెళ్లాలనుకుంటున్నాయో తెలుసా?