ఛార్ ధామ్ రూట్లో టన్నెల్…BROపై గడ్కరీ ప్రశంసలు

ఛార్ ధామ్ ప్రాజెక్ట్ లో  బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గ‌నైజేష‌న్‌(BRO)టీమ్ పెద్ద పురోగతి సాధించినట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఉత్త‌రాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్ర మార్గంలోని రిషికేశ్‌-ధ‌రాసు హైవే(NH94)పై బిజీగా ఉండే చంబా ప‌ట్ట‌ణం కింద 440మీటర్ల పొడవైన టన్నెల్ ను బీఆర్వో టీమ్ విజయవంతంగా తవ్వినట్లు గడ్కరీ తెలిపారు.చంబా టన్నెల్ నిర్మాణంలో లేటెస్ట్ ఆస్ట్రియన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు తెలిపారు.

అన్ని సమయాల్లో చార్ ధామ్-గంగోత్రి,కేధార్ నాథ్,బద్రీనాథ్,యమునోత్రి కనెక్టివిటీ కోసం 12వేల కోట్లతో కేంద్రం ఛార్ దామ్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. చంబా టన్నెల్ నిర్మాణం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేసిన గడ్కరీ…టన్నెల్ నిర్మించిన బీఆర్‌వో టీమ్‌కు మంత్రి కంగ్రాట్స్ చెప్పారు.

కరోనా మహమ్మారి కాలంలో నేషన్ బిల్డిండ్ లో ఇది ఒక అద్భుతమైన విన్యాసంగా గడ్కరీ అభివర్ణించారు.  ఈ ట‌న్నెల్ వ‌ల్ల చార్‌థామ్ యాత్ర‌కు వ‌చ్చే ప్ర‌యాణికుల ట్రాఫిక్ నియంత్ర‌ణ సులువు కానున్న‌ది. ట‌న్నెల్‌తో పాటు ఆరు కిలోమీటర్ల రోడ్డు మార్గం కోసం 88 కోట్లు ఖ‌ర్చు అయింది..

Read: మరో రాష్ట్రంలో లిక్కర్ హోం డెలివరీ ప్రారంభించిన జొమాటో