Fuel Price : స్థిరంగా కొనసాగుతున్న ఫ్యూయల్ రేట్లు

పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం(సెప్టెంబర్ 13) కూడా స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. డీజిల్ ధరలు జూలై 15వ తేదీ నుండి స్థిరంగా ఉన్నాయి.

Fuel Price : పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం(సెప్టెంబర్ 13) కూడా స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. డీజిల్ ధరలు జూలై 15వ తేదీ నుండి స్థిరంగా ఉన్నాయి. ఇటీవల ధరలు పెరగలేదు. ఇంధన ధరలు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరుగంటలకు ధరలను సవరిస్తాయి. చివరిసారి జూలై నెలలో లీటర్ పెట్రోల్ పైన 30 పైసలు పెరిగింది. జూలైలో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. గత ఆగస్ట్ నెలలో ధరలు ఒక్కసారి కూడా పెరగలేదు.

దేశంలోని వివిధ నగరాల్లో ఇంధన ధరలు ఈ విధంగా ఉన్నాయి..

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.19, లీటర్ డీజిల్ రూ.88.62గా ఉంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.107.26, డీజిల్ రూ.96.19గా ఉంది.
చెన్నైలో పెట్రోల్ రూ.98.96, డీజిల్ రూ.93.26 ఉంది.
కోల్‌కతాలో పెట్రోల్ రూ.101.62, డీజిల్ రూ.91.71గా ఉంది.
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.105.35, డీజిల్ రూ.96.85గాఉంది.

పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు