చెన్నై యువకుడు గిన్నీస్ రికార్డ్..నీటిలో శ్వాస ఆపేసి..పజిల్ కంప్లీట్ చేసి రికార్డు

  • Publish Date - August 26, 2020 / 12:07 PM IST

‘రూబిక్ క్యూబ్‌’..ఈ పజిల్ సాల్వ్ చేయాలంటే చాలామందికి తల ప్రాణం తోకకు వస్తుంది. కొంతమంది మాత్రం చిటికెలో చేసేస్తారు. చకచకా చేసిపడేస్తారు. కానీ అదే ‘రూబిక్ క్యూబ్‌’పజిల్ తో ఏకంగా గిన్నిస్ రికార్డు సాధించాడు చెన్నైకు చెందిన ఓ యువకుడు. హా…ఇది ‘రూబిక్ క్యూబ్‌’పజిల్ చాలామంది చేస్తారు..అంతమాత్రాన గిన్నీస్ రికార్డు వచ్చేస్తుందా ఏంటీ మరీ చోద్యం కాకపోతే అనుకోవచ్చు కదూ..అంతేమరి గిన్నీస్ రికార్డ్ అంటే అంత ఈజీ కాదుగా..అక్కడే ఉంది అసలు టాక్స్..అదే చెన్నైకు చెందిన యువకుడు ఇల్లాయరమ్ శేఖర్ టాలెంట్…



తమిళనాడులోని చెన్నైకు చెందిన ఇల్లాయరమ్ శేఖర్ ఒకేసారి ఆరు రూబిక్ క్యూబ్స్ సాల్వ్ చేశాడు..అదికూడా నీళ్లల్లో ఊపిరి బిగించి కూర్చుని…కేవలం రెండు నిమిషాల పదిహేడు సెకండ్లలోనే ఒకేసారి ఆరు రూబిక్ క్యూబ్ సాల్వ్ చేసేసాడు..!! మరి గిన్నీస్ రికార్డు రాకేం చేస్తుంది..వచ్చి పడింది రికార్డు..గిన్నీస్ రికార్డ్..
https://10tv.in/muslim-man-weds-off-daughters-of-his-rakhi-sister-as-per-hindu-customs/
నీటిలో కూర్చుని ఒకదాని తర్వాత మరొకటి మొత్తం ఆరు క్యూబ్స్ సరి చేసి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించాడు ఇల్లాయరమ్ శేఖర్. మొత్తం రెండు నిమిషాల 17 సెకండ్ల పాటు గాజుగ్లాసులోని నీళ్లలో ఊపిరి బిగపట్టి ఈ విజయం సాధించాడు. స్విమ్మింగ్ గ్లాసెస్ పెట్టుకున్న శేఖర్.. నీళ్లలో కూర్చుని తన పని తాను టకటకా చేసుకుంటూపోయాడు. చాకచక్యంగా..చకచకా చేసుకుంటూ పోయిన శేఖర్ టాలెంట్.. చూసి ముక్కున వేలు వేసుకున్నారు. ఆగస్టు మొదటి వారంలోనే శేఖర్ ఈ ఘనత సాధించినా.. గిన్నిస్ బుక్ సంస్థ శేఖర్ టాలెంట్ ను తాజాగా ధ్రువీకరించింది.



దీనిపై శేఖర్ మాట్లాడుతూ.. ‘2013 నుంచి రూబిక్ క్యూబ్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. నాకు ఈ రికార్డు సృష్టించడానికి రెండేళ్లు పట్టింది. మనసు ఏకాగ్రతగా ఉంటే..స్ఫూర్తిదాయకంగా ఉంటే దేన్నైనా ఎదుర్కోగలం. ఈ రికార్డు సాధనలో నాకు యోగా, ప్రాణయామం ఎంతగానో ఉపయోగపడ్డాయి’ అని శేఖర్ తెలిపాడు. యోగా అనేది ఏకాగ్రతకు చాలా ఉపయోగపడుతుందని..ఎటువంటి కష్టాలనైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుందని అన్నాడు. అందుకే తాను ఎక్కడ కూర్చున్నాను..ఎలా కూర్చున్నాను..రికార్డు సాధిస్తానా లేదా? అనే టెన్షన్ ఏమీ లేకుండా సాధించానని తెలిపాడు.