Chhattisgarh CM Bhupesh Baghel says ‘bajrangi gunde’ roaming around in saffron to extort money
Bhupesh Baghel: పఠాన్ సినిమా కాంట్రవర్సీ అధికార-విపక్షాల మధ్య యుద్ధంగా మారింది. ఒకవైపు చైనా-భారత్ మధ్య ఏర్పడ్డ ఘర్షణలపై యుద్ధం కొనసాగిస్తూనే పఠాన్ సినిమా వివాదంలోకి కూడా తలదూర్చుతున్నారు ఇరు పక్షాల నేతలు. పఠాన్ సినిమా హిందువులు మనోభావాలు దెబ్బతీసిందని, ఆ సినిమాను బ్యాన్ చేయాలంటూ మొదట అధికార భారతీయ జనతా పార్టీ వివాదానికి తెర లేపగా, ఈ అంశంపై అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీ నేతలు కౌంటర్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బజరంగీ గూండాలు కాషాయ దుస్తుల్లో తిరుగుతూ డబ్బులు దండుకుంటున్నారని బాఘేల్ అన్నారు. పఠాన్ సినిమాలోని ‘బేషరం రంగ్’ పాటలో దీపిక పదుకొనె కాషాయ రంగు బట్టలు ధరించడంపై విశ్వ హిందూ పరిషత్ సహా మరికొన్ని రైట్ వింగ్ గ్రూపులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బాఘేల్ ఈ విధంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘‘సాధువులు కుటుంబాన్ని, ఆస్తుల్ని త్యాగం చేస్తారు. సర్వస్వం త్యాగం చేసి కాషాయం చుడతారు. కానీ ఈ బజరంగీ గూండాలు కాషాయం కట్టుకుని తిరుగుంటారు. వాళ్లు ఏం త్యాగం చేశారని కాషాయం చుట్టారని ఒకరు నన్ను ఇదే విషయమై అడిగారు. కుటుంబాన్ని వదిలేశారా? కోరికల్ని చంపుకున్నారా? ఇక్కడో నిజం ఏంటంటే.. కాషాయ బట్టల్లో తిరుగుతూ డబ్బులు దండుకుంటున్నారు’’ అని అన్నారు.
Kapil Sibal: కొలీజియంను సమర్ధించిన కపిల్ సిబాల్.. కోర్టులు కాషాయమయం కావొద్దంటూ హెచ్చరిక
ఇక భారతీయ జనతా పార్టీ పేరు ప్రస్తావించి సైతం ఆయన విమర్శలు గుప్పించారు. సినిమాల్లోని నటులు కాషాయం చుడితే బీజేపీ నేతలు అభ్యంతరం చెబుతున్నారు. నిజానికి బీజేపీ నేతలంతా కాషాయం చుట్టిన నటులేనని ఆయన విమర్శించారు. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన పఠాన్ వచ్చే జనవరి 25న విడుదల కానుంది. అనేక విమర్శల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.