Chhattisgarh and Mizoram Election 2023
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మిజోరంలో ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మిజోరాం రాష్ట్రంలో సాయంత్రం 5 గంటలకు 69.87 శాతం పొలింగ్ నమోదు అయిందని, అలాగే ఛత్తీస్‌గఢ్ లో 5 గంటల వరకు 70.87 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి ఛత్తీస్‌గఢ్ లో మొదట ఓటింగ్ కాస్త మందకొడిగా సాగినప్పటికీ.. సాయంత్రం జోరు అందుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 6.92గా ఉన్న పోలింగ్.. ఒక్కసారిగా పెరిగి 70.87 శాతానికి వచ్చింది. ఇదే సమయంలో మిజోరాంలో సాయంత్రం ఓటింగ్ కాస్త మందగించింది.
60.92% voter turnout recorded till 3 pm in Chhattisgarh and 69.87% in Mizoram. https://t.co/UJ76VGbOsE
— ANI (@ANI) November 7, 2023
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మిజోరాం ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు తరలివస్తున్నారు. ఓట్లు వేసేందుకు మిజో ప్రజలకు భారీ క్యూలతో ముందుకు కదిలారు. ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించిన ప్రకారం.. రాష్ట్రంలో మధ్యాహ్నం 3 గంట వరకు 69.87 శాతం పోలింగ్ నమోదైందట.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లా భైరామ్‌ఘర్ బ్లాక్‌లోని సెన్సిటివ్ గ్రామమైన చిహ్కా పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి వచ్చిన గ్రామస్థులకు ఓటు వేసిన తర్వాత వారి వేళ్లపై చెరగని సిరా వేయడం లేదు. ఇది అబుజ్‌మద్‌కు ఆనుకుని ఉన్న భైరామ్‌ఘర్ బ్లాక్‌లోని గ్రామం. నక్సలైట్ల భయంతోనే ఇక్కడ గ్రామస్తులు ఇలా చేస్తున్నారని, వారితో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేసినా వారు కెమెరాలో ఏమీ చెప్పడానికి సిద్ధంగా లేరని అధికారులు చెబుతున్నారు. రెండవ కేసు చిహ్కా పోలింగ్ బూత్. ఇక్కడ నక్సలైట్ల బహిష్కరణ తర్వాత కూడా, అంతర్గత ప్రాంతాల్లోని గ్రామస్థులు తమ సొంత ప్రయత్నాలు, మార్గాల పోలింగ్ బూత్ కు వస్తున్నారు. ఓటు వేయడానికి ఏడెనిమిది కిలోమీటర్లు నడుస్తున్నారు. వారిలో ఒక వృద్ధుడు తన కోడలు, కుమార్తెతో వచ్చాడు. నక్సలైట్ల బెదిరింపులు తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ వీళ్లు తమ ఓటు వేయడానికి రావడం గమనార్హం.
మిజోరాం అసెంబ్లీకి మంగళవారం (నవంబర్ 7) ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే పోలింగ్ కొనసాగుతుండగానే.. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మిజో నేషనల్ ఫ్రంట్ చీఫ్ జోరమ్‌తంగా. ఈ ఎన్నికల్లో గెలిచి సొంతంగానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 40 స్థానాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా 16 మంది మహిళలు సహా మొత్తం 174 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అధికార ఎంఎన్‌ఎఫ్ సహా కాంగ్రెస్, జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌లు అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగులో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 44.55 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఇందులో భానుప్రతాపూర్‌లో అత్యధికంగా 61.83 శాతం ఓటింగ్ నమోదు కాదా, బీజాపూర్‌లో అత్యల్పంగా 20.09 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఇక పోలింగ్ జరుగుతున్న 20 అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు చూస్తే..
అంతఘర్ - 55.65 శాతం
బస్తర్ - 44.14 శాతం
భానుప్రతాపూర్ - 61.83 శాతం
బీజాపూర్ - 20.09 శాతం
చిత్రకోట్ - 34.16 శాతం
దంతేవాడ - 41.21 శాతం
దొంగగావ్ - 39.00 శాతం
దొంగగర్ - 41.10 శాతం
జగదల్పూర్ - 45.81 శాతం
కాంకర్ - 61.80 శాతం
కవర్ధ - 41.67 శాతం
కేశకల్ - 52.66 శాతం
ఖైరాఘర్ - 44.27 శాతం
దురద - 46.67 శాతం
కొండగావ్ - 54.04 శాతం
కొంటా - 30.27 శాతం
మోహ్లా-మన్పూర్ - 56.00 శాతం
నారాయణపూర్ - 46.00 శాతం
రాజ్‌నంద్‌గావ్ - 38.00 శాతం
పండరియా - 39.44 శాతం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మోహ్లా-మన్‌పూర్-అంబగఢ్ చౌకీ జిల్లాలో ఉన్న మొహ్లా మన్‌పూర్ అసెంబ్లీలో ఓటింగ్ సమయం ముగిసింది. పోలింగ్ కేంద్రాల ప్రధాన గేట్లకు తాళాలు వేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే అనుమతించారు. కేంద్రంలో ఉన్న ఓటర్ల ద్వారా ఓటింగ్ కొనసాగుతోంది. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ సమయాన్ని నిర్ణయించారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మిజోరాం ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకు తరలివస్తున్నారు. ఓట్లు వేసేందుకు మిజో ప్రజలకు భారీ క్యూలతో ముందుకు కదిలారు. ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించిన ప్రకారం.. రాష్ట్రంలో మధ్యాహ్నం 1 గంట వరకు 53 శాతం పోలింగ్ నమోదైందట. ఇందులో సర్చిప్ జిల్లాలో అత్యధికంగా 60.37 పోలింగ్ నమోదైంది. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇక రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోందని మిజోరాం అదరనపు ముఖ్య ఎన్నికల అధికారి హెచ్ లింజేలా తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకవైపు జరుగుతుండగా.. ఎన్నికల సిబ్బంది, భద్రతా సిబ్బందిపై నక్సలైట్లు దాడులు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నుంచే ఎన్నికలు బహిష్కరించాలని నక్సల్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలుమార్లు దాడులకు పాల్పడ్డారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక నాయకుడిని సైతం హత్య చేశారు. కాగా పోలింగ్ జరుగుతున్న మంగళవారం కూడా దాడులకు దిగారు. సుక్మా జిల్లాలోని తాడ్మెట్ల డ్యూలడ్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లకు నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మొదట నక్సల్స్ కాల్పులు జరపడంతో అనంతరం జవాన్లు కాల్పులు జరిపారు. కాగా 20 నిమిషాల పాటు జరిగిన ఈ దాడిలో కొద్ది మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలైనట్లు తెలిసింది.
మిజోరం, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. మిజోరంలో మధ్యాహ్నం 1 గంటల వరకు 52.73 శాతం ఓటింగ్ జరిగింది. అదేవిధంగా ఛత్తీస్‌గఢ్‌లో మధ్యాహ్నం 1 గంటల వరకు 44.55 శాతం ఓటింగ్ జరిగింది.
ఉదయం 11 గంటల వరకు ఛత్తీస్‌గఢ్‌లో 22.97 శాతం, మిజోరంలో 26.43 శాతం ఓటింగ్ నమోదయినట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
నార్త్ బస్తర్, కంకేర్ 16.48శాతం
కబీర్దామ్ 12.51శాతం.
కొండగావ్ 13.39 శాతం.
ఖైరాఘర్ 6శాతం.
సౌత్ బస్తర్ దంతేవాడ 10.18శాతం.
నారాయణపూర్ 11శాతం.
బస్తర్ 4.89 (3)శాతం.
బీజాపూర్ 4.50శాతం.
మన్సూర్ మొహల్లా 9శాతం.
రాజ్ నందగావ్ 8.34 శాతం
సుక్మా 4.21శాతం.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 101ఏళ్ల వృద్ధుడు పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. 24-ఛంపై సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రుయంత్ లాంగ్ పోలింగ్ స్టేషన్ లో 101ఏళ్ల రువల్ నుడాలా, అతని భార్య 86ఏళ్ల తంగ్‌లీత్‌లు కలిసివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Mizoram Assembly Elections (Image source ANI)
మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఐజ్వాల్ సౌత్ - II లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
#WATCH | Mizoram Governor Hari Babu Kambhampati casts his vote at a polling booth in Aizawl South - II. #MizoramElections2023 pic.twitter.com/wDjBQVlLRt
— ANI (@ANI) November 7, 2023
మిజోరం, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఓటర్లు ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
I call upon the people of Mizoram to vote in record numbers. I particularly urge the young and first time voters to exercise their franchise and strengthen the festival of democracy.
— Narendra Modi (@narendramodi) November 7, 2023
छत्तीसगढ़ में आज लोकतंत्र के पावन उत्सव का दिन है। विधानसभा चुनाव के पहले चरण के सभी मतदाताओं से मेरा अनुरोध है कि वे अपना वोट जरूर डालें और इस उत्सव के भागीदार बनें। इस अवसर पर पहली बार वोट डालने वाले राज्य के सभी युवा साथियों को मेरी विशेष बधाई!
— Narendra Modi (@narendramodi) November 7, 2023
మిజోరం సీఎం జోరంతంగా ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారు. ఓటింగ్ గదిలోపలికి వెళ్లిన ఆయన ఓటు వేసేందుకు ప్రయత్నించగా ఈవీఎం మిషన్ పనిచేయలేదు. దీంతో సీఎం ఓటు వేయకుండానే వెనుతిరిగి వచ్చారు. మళ్లీ కొద్దిసేపటి తరువాత ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఈ విషయంపై మిజోరం సీఎం, ఎంఎన్ఎఫ్ అధ్యక్షుడు జోరంతంగా మాట్లాడుతూ.. ఓటింగ్ మిషన్ పనిచేయకపోవడంతో కొంత సమయం ఓటింగ్ హాల్ లో వేచి ఉన్నాను. అయినప్పటికీ, మిషిన్ పనిచేయలేదు. దీంతో ఓటింగ్ హాల్ నుంచి వెనుదిరిగి వచ్చాను. మళ్లీ వచ్చి ఓటు వేస్తాననని చెప్పారు.
"Machine not working": Mizoram CM Zoramthanga fails to cast vote as EVM malfunctions
Read @ANI Story | https://t.co/CEvtU3876k#Mizoram #Zoramthanga #MizoramElections2023 #MizoramAssemblyElections #MNF pic.twitter.com/KcUBoxvxov
— ANI Digital (@ani_digital) November 7, 2023
ఛత్తీస్ గఢ్ లోని ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని అవినీతి, కుంభకోణాల పాలనను అంతమొందించేందుకు గిరిజన సమాజం, రైతులు, పేదలు, యువత సంక్షేమానికి అంకితమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఛత్తీస్ గఢ్ మొదటి దశ ఓటర్లందరూ అత్యధిక సంఖ్యలో ఓటు వేయాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు.
छत्तीसगढ़ के प्रथम चरण के सभी मतदाताओं से अपील करता हूँ कि प्रदेश से भ्रष्टाचार और घोटालों के शासन को समाप्त कर जनजातीय समाज, किसानों, गरीबों और युवाओं के कल्याण के प्रति समर्पित सरकार चुनने के लिए अधिक से अधिक संख्या में मतदान करें।
आपका एक बहुमूल्य वोट छत्तीसगढ़ के सुनहरे…— Amit Shah (@AmitShah) November 7, 2023
మిజోరంలోని సోదరీమణులు, సోదరులు, ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓటు వేయాలని నేను కోరుతున్నాను. ప్రతి ఓటు అభివృద్ధి చెందిన, సంపన్నమైన మిజోరాంకు పునాది వేస్తుంది అని అమిత్ షా అన్నారు.
I urge our sisters and brothers in Mizoram, especially the youth to come out and vote in large numbers.
Each and every vote will lay the foundation of a developed and prosperous Mizoram.— Amit Shah (@AmitShah) November 7, 2023
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. వీటిలో నారాయణపూర్ కూడా ఉంది. ఇక్కడ 7గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మిగిలిన స్థానాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మొదటి దశలో పోలింగ్ జరిగే 20 నియోజకవర్గాల్లో బస్తర్ డివిజన్ ఉంది. ఈ డివిజన్ లో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈసీ ప్రత్యేక దృష్టిసారించింది.
రాష్ట్రంలో 60 వేల మందితో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. వీరిలో 40వేల మంది సీఆర్పీఎఫ్, 20 వేల మంది రాష్ట్ర పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. డ్రోన్లు, హెలికాప్టర్లతో నిఘా ఉంచారు.
తొలి దశలో 5,304 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 25వేల మందికి పైగా ఎన్నికల సిబ్బందిని నియమించారు. ఈ 5,304 పోలింగ్ కేంద్రాల్లో 2,431 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఉంది.
మిజోరం (40 నియోజకవర్గాలు)లో మొత్తం ఓటర్లు 8,57,063
మహిళలు 4,39,026
పోలింగ్ కేంద్రాలు 1,276
తొలిసారి ఓటుహక్కు పొందిన వారు 50,611
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం (20 నియోజకవర్గాలు)లో ఓటర్లు 40,78,681
మహిళలు 20,84,675
పోలింగ్ కేంద్రాలు 5,304
తొలిసారి ఓటు హక్కు పొందినవారు 1,64,299
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో తొలిదశలో పోలింగ్ జరిగే 20 స్థానాలకు 223 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఇందులో 25 మంది మహిళలు ఉన్నారు.
మిజోరం రాష్ట్రంలో మొత్తం 40 నియోజకవర్గాల్లో 174 మంది అభ్యర్ధులో బరిలో ఉన్నారు. వీరిలో 18 మంది మహిళలు ఉన్నారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను తొలి విడతలో 20 నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతుంది. మిజోరం రాష్ట్రంలో మొత్తం 40 నియోజకవర్గాల్లో ఒకేదశలో పోలింగ్ జరుగుతుంది. రెండు రాష్ట్రాల్లో కలిపి మంగళవారం మొత్తం 60 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.