భక్షించినవారే రక్షించాలి : ఏనుగుల్నించి కాపాడమని ఏనుగు విగ్రహం ప్రతిష్టించారు

  • Published By: veegamteam ,Published On : September 20, 2019 / 09:32 AM IST
భక్షించినవారే రక్షించాలి : ఏనుగుల్నించి కాపాడమని ఏనుగు విగ్రహం ప్రతిష్టించారు

Updated On : September 20, 2019 / 9:32 AM IST

భక్షించినవారే రక్షించాలి అనే కాన్పెప్ట్ ను ఎంచుకున్నారు ఛత్తీస్ గఢ్ వాసులు. ఎవరైతే తమ పంటల్ని నాశనానికి కారణమవుతున్నారే వారే తమను రక్షించాలని రైతన్నలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ వారి పంటల్ని నాశనం చేసేది ఎవరనే డౌట్ వచ్చింది కదూ..ఇంకెవరూ..గజరాజులు..అదేనండీ ఏనుగులు. అడవుల రాష్ట్రమైన ఛత్తీస్ గఢ్ లోని రైతులకు ఏనుగుల బెడద ఎక్కువైపోయింది. అడవుల్లోంచి వస్తున్న ఏనుగులు పంటల్ని నాశనంచేస్తున్నాయి. తినేది ఎలా ఉన్నా పంటంతా నాశనం చేసేస్తున్నాయి. అంతేకాదు మనుషులపై దాడిచేసి చంపేస్తున్నాయి. దీంతో రైతులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ఊరి బైట ఏనుగు విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకున్నారు. దీని కోసం విరాళాలు సేకరించి ఏనుగు విగ్రహాన్ని ప్రతిష్టించారు. 

వివరాల్లోకి వెళితే..కుక్రాదిహ్ గ్రామం అడవులు పక్కనే ఉంటుంది. దీంతో అడవుల్లోంచి తరచూ ఏనుగుల గుంపులు దాడులు చేసి పంటలను నాశనం చేస్తున్నాయి. అడ్డుకున్న గ్రామస్థులపై ఏనుగులు దాడిచేస్తున్నాయి. ఈ  దాడిలో 65 మంది గ్రామస్థులు మృతి చెందారు.  గ్రామస్థులు చేసిన దాడిలో 14 ఏనుగులు కూడా మరణించాయి. దీంతో రక్షించినవారే భక్షించాలి అనే ఉద్ధేశంతో ఏనుగుల దాడి నుంచి రక్షించాలని కోరుతూ గ్రామస్థులంతా కలిసి ఊరి చివర ఏనుగు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఏనుగు విగ్రహ ప్రతిష్ఠిన అనంతరం కుక్రాదిహ్ గ్రామస్థులందరూ మహిళలతో కలిసి ఉపవాసాలు ఉన్నారు. 

గణేషుడే తమ పంటలను ఏనుగుల బారి నుంచి కాపాడాలని ఏనుగు విగ్రహాన్ని వేడుకున్నారు. ఏనుగు ముఖం గల గణేషుడు తమ పంటలను కాపాడాలని కోరుతూ ఏనుగు విగ్రహాన్ని ప్రతిష్ఠించామని సాహు అనే గ్రామస్థుడు తెలిపాడు. తాము ఏనుగు విగ్రహాన్ని ప్రతిష్టించాక  తమ గ్రామానికి ఏనుగుల గుంపు రావడం లేదని గ్రామ పెద్ద రాథేలాల్ సిన్హా సంతోషంగా వ్యక్తం చేస్తు చెప్పారు. ఇదొక విశేషమతే..మరో విశేషం ఏమిటంటే..అటవీశాఖ అధికారులు కూడా దృవీకరించటం.