ఓటు వేసిన ఒడిషా సీఎం

ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఒడిషా రాజధాని భువనేశ్వర్ లోని ఏరోడ్రోమ్ గవర్నమెంట్ యూపీ స్కూల్ లోని 112వ నెంబర్ పోలింగ్ బూత్ లో నవీన్ పట్నాయక్ ఓటు వేశారు.సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) 13 రాష్ట్రాలు,2కేంద్రపాలిత ప్రాంతాల్లో 116 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఒడిషాలో భువనేశ్వర్,కటక్, ధన్ కనల్,సంబల్ పూర్,కియోంజహర్,పూరి లోక్ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది.