Chief Of Naval Staff : క్యాడెట్లతో పుష్ అప్స్ చేయించిన నేవీ చీఫ్ అడ్మిరల్

పూణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ 140వ కోర్సులో 300 మందికి పైగా పాల్గొన్నారు. వీరి పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. వీరి కవాతును చూసేందుకు నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిచేత పుష్ అప్స్ చేయించారు.

Navy Chief Admiral

Karambir Singh Push Ups at NDA : అతనో నేవీ చీఫ్ అడ్మిరల్. క్యాడెట్ల అవుట్ పరేడ్ జరుగుతోంది. కవాతను సమీక్షించేందుకు ఆయన హాజరయ్యారు. అనంతరం క్యాడెట్లతో పుష్ అప్స్ చేయించారు. చేయించడమే కాదు..ఆయన కూడా స్వయంగా చేయడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

పూణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ 140వ కోర్సులో 300 మందికి పైగా పాల్గొన్నారు. వీరి పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. వీరి కవాతును చూసేందుకు నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారితో మాట్లాడారు. అనంతరం వారిచేత పుష్ అప్స్ చేయించారు. తాను చేసి వారిని ఉత్సాహ పరిచారు. ఒక్కొక్కరితో దాదాపు 25 నుంచి 30 పుష్ అప్స్ చేయించారు. ఈ కేంద్రంలో సైన్యం, వైమానిక దళం, నేవీ శిక్షణ ఇస్తారు. మూడేండ్ల పాటు కోర్సు చేయాల్సి ఉంటుంది. కోర్సు పూర్తి చేసిన అనంతరం వారు తమ అకాడమీలో ఒక ఏడాది తుది శిక్షణ పొందుతారు.

Read More : Etawah : పెళ్లిలో విషాదం, చనిపోయిన పెళ్లి కుమార్తె, శవాన్ని పక్కనే ఉంచి వివాహం