Odisha : ఒడిశాలో గిరిజన తెగ వింత ఆచారం.. దుష్టశక్తులు దరిచేరకుండా చిన్నారులకు వీధి కుక్కలతో వివాహం

హో తెగకు చెందిన గిరిజనులు తమ పిల్లల దవడలపై దంతాలు కనిపించటం అశుభంగా భావిస్తారు. అందువల్ల కుక్కలతో పెళ్లి చేస్తే వారి నుంచి దుష్టశక్తులు పారిపోతాయని నమ్ముతారు.

Odisha : శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించినా ప్రజలు మూఢనమ్మకాలను వదలడం లేదు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో దుష్టశక్తులు దరిచేరకూడదని కొన్ని గిరిజన తెగలు తమ పిల్లలకు వీధి కుక్కలతో వివాహాలు జరిపిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

బాలాసోర్ జిల్లాలోని సోరో బ్లాక్ బంద్ సాహి గ్రామానికి చెందిన 11 ఏళ్ల తపన్ సింగ్ అనే బాలుడికి ఆడ కుక్కతో, ఏడేళ్ల వయసున్న లక్ష్మీ అనే చిన్నారికి మగ కుక్కతో వివాహం జరిపించారు. చిన్నారుల నుంచి దుష్టశక్తులను పారదోలేందుకే వీధి కుక్కలతో వివాహం చేశామని గ్రామస్థులు పేర్కొన్నారు.

Holi 2023 : హోలీ పండుగ రోజున ఊరొదిలిపోయే పురుషులు .. 200 ఏళ్లనుంచి వస్తున్న వింత ఆచారం

హో తెగకు చెందిన గిరిజనులు తమ పిల్లల దవడలపై దంతాలు కనిపించటం అశుభంగా భావిస్తారు. అందువల్ల కుక్కలతో పెళ్లి చేస్తే వారి నుంచి దుష్టశక్తులు పారిపోతాయని నమ్ముతారు. సంప్రదాయాల ప్రకారం తమ గ్రామంలో కుక్కలతో చిన్నారులకు వివాహాలు చేస్తున్నారని 28 ఏళ్ల సాగర్ సింగ్ అనే గ్రాడ్యుయేట్ తెలిపారు.

కుక్కలతో నిశ్చయమైన తర్వాత జరిగే చెడు కుక్కలకు చేరుతుందని తమవారు నమ్ముతారని పేర్కొన్నారు. ఈ విశ్వాసాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినప్పటికీ ముూఢనమ్మకం మాత్రం కొనసాగుతుందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు