దేశానికి ప్రథమ శత్రువు పాకిస్తాన్ అని అందరు భావిస్తారు కానీ, పాక్ కంటే చైనాతోనే దేశానికి ముప్పు పొంచి ఉందని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. చైనా మిలటరీ ఇండియా ఆర్మీ కంటే పది రెట్లు ఎక్కువగా ఉండొచ్చునన్నారు. మనకు పొరుగున ఉన్న దేశాలను డ్రాగన్ తనవైపునకు తిప్పుకుంటోందని హెచ్చరించారు.
చైనా పర్యటనలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌లు షేక్ హ్యాండ్స్ ఇవ్వడం ద్వారా ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కారం కావని అన్నారు.అయితే రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని, చైనాను అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చి, దేశ సమస్యను పరిష్కరించాలని సూచించారు.
మరోవైపు చైనా పాక్ దేశాలు మాత్రమే భారత్‌కు శత్రువులు కావని, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు కూడా భారత్‌కు శత్రు దేశాలే అని అన్నారు. బంగ్లాదేశ్‌లోని అంతర్గత సమస్యను భారత్ పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే బంగ్లాదేశ్ మాత్రం చైనాతో ఒప్పందాలు చేసుకుంటుందని ద్వజమెత్తారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ముఖ్య అంశాలలో సైతం ప్రతిపక్షాలను సంప్రదించడం లేదని శరద్ పవార్ విమర్శించారు
నరేంద్ర మోడీ తొలిసారి ప్రధాని అయినప్పుడు నేపాల్‌కు వెళ్లారు. ఇండియాకు నేపాల్ మిత్ర దేశం అని పొగిడారు. కానీ నేపాల్ ఇప్పుడు చైనాకు మద్దతుగా ఉంది. చైనా మెళ్లిగా మన మిత్ర దేశాలను తన వైపునకు తిప్పుకుంటోంది అని పవార్ పేర్కొన్నారు.