Chinese soldier apprehended in Ladakh లడఖ్ సరిహద్దుల్లో చైనా సైనికుడిని భారత భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. చుమార్-డెమ్ చోక్ ప్రాంతంలో చైనా ఆర్మీ చెందిన జవాను అనుకోకుండా భారత భూభాగంలోకి ఎంటర్ అవడంతో,అతడిని భారత దళాలు అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మీ వర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతం ఆ చైనా ఆర్మీ జవాన్ సేఫ్ కస్టడీలో ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి. చైనా సైనికుడి దగ్గర సివిల్, మిలిటరీ డాక్యుమెంట్లు ఉన్నట్లు భారత అధికారులు గుర్తించారు.
భారత భూభాగంలోకి వచ్చిన చైనా సనికుడిని కోర్పోరల్ వాంగ్ యా లోంగ్ గా గుర్తించారు. ఆ జవాన్ వెరిఫికేషన్ పూర్తి అయిందని,ప్రోటోకాల్ ప్రకారం సమాచారం సేకరించిన తర్వాత అతన్ని తిరిగి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(చైనా ఆర్మీ)కి అప్పగించనున్నట్లు ఇండియన్ ఆర్మీ వర్గాలు తెలిపాయి.
కాగా, జూన్ 14న తూర్పు లడఖ్ సరిహద్దులో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో చైనా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోయారు. ఆ నాటి నుంచి సరిహద్దు మరింత టెన్షన్‌గా మారిన విషయం తెలిసిందే.