ఉగ్రవాద శిబిరాలను హఢలెత్తించిన అభినందన్ గుర్తుండే ఉంది కదా. అవును పాక్ భూ భాగంలోకి చొచ్చుకొని పోయి..టెర్రరిస్టులపై బాంబుల వర్షం కురిపించిన ఈ హీరో ఎవరికైనా గుర్తుండే ఉంటుంది. వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ విగ్రహాన్ని చాక్లెట్‌తో తయారు చేసిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జుకా అనే షాపు పుదుచ్చేరిలో ప్రసిద్ధి చెందింది.
క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ప్రముఖులు, రాజకీయ నేతలకు సంబంధించిన విగ్రహాలు తయారు చేస్తుంది యాజమాన్యం. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఈసారి అభినందన్ చాక్లెట్ విగ్రహాన్ని తయారు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా బెల్జియం నుంచి చాక్లెట్ తీసుకొచ్చారు. 321 కిలోల బరువుతో 5 అడుగుల ఎత్తు, 10 అంగుళాల వెడల్పుతో దీనిని తయారు చేశారు. చాక్లెట్ విగ్రహాన్ని తయారు చేయడానికి మొత్తం 124 గంటలు పట్టింది.
* పుదుచ్చేరిలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. మరికొద్ది రోజులే ఉండడంతో ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు. వివిధ రకాల కేకులు దర్శనమిస్తున్నాయి. స్టార్ హోటళ్లలో భారీ రకాల కేకులను తయారు చేస్తున్నారు.
* ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్తాన్ లోని బాలాకోట్ లో ఉన్న ఉగ్రశిబిరాలపై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే.
* బాలాకోట్ వైమానిక దాడి అనంతరం జరిగిన పరిణామాల్లో పాక్ యుద్ధ విమానాలను తరుముకుంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పట్టుబడ్డాడు.
* ఇండియన్ భూ భాగంలోకి వచ్చిన పాకిస్తాన్ యుద్ద విమానం ఎఫ్ 16 ను తరిమి కొట్టి కూల్చేసిన తరువాత మిగ్ 21 బైసన్ విమానం అదే స్పీడ్ లో పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లి టెక్నికల్ కారణంతో కూలిపోయింది.
* విమానం కూలిపోతున్న సమయంలో అభినందన్ ప్యారచూట్ సాయంతో పాకిస్తాన్ నేలపై దిగారు.
* అభినందన్ వర్థమాన్ ను భారత్ సహా, ప్రపంచ దేశాల ఒత్తిడితో క్షేమంగా భారత్ కు అప్పగించింది. పలు పరీక్షల అనంతరం ఇటీవల తిరిగి వాయుసేనలో అభినందన్ చేరారు.
Read More : CAA : రగులుతున్న యూపీ..రెచ్చిపోతున్న అల్లరిమూకలు