పౌరసత్వ సవరణ రణరంగం : హింస సరికాదు : కిషన్ రెడ్డి

  • Publish Date - December 16, 2019 / 06:02 AM IST

ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై ఆయన రెస్పాండ్ అయ్యారు. 2019, డిసెంబర్ 16వ తేదీ సోమవారం మీడియాతో మాట్లాడారు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ఇలాంటి హింసాత్మక ఘటనలకు ఏ రాజకీయ పార్టీ మద్దతివ్వదని..కానీ..నిరసనకారులకు మద్దతు తెలిపేలా ఓ సీఎం మాట్లాడుతున్నారని ఆరోపించారు.

హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడ్డారని, బస్సులు, ప్రైవేటు ప్రాపర్టీస్, పబ్లిక్ ప్రాపర్టీస్‌లను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారన్నారు. శాంతియుతమైన పద్ధతుల్లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఎవరికైనా ఉందని..అయితే..హింసకు తావు లేదన్నారు. హింసకు పాల్పడి..ప్రజలకు ఇబ్బందులు కలిగి విధంగా..ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు ఎవరకీ లేదన్నారు.

ఓవైపు మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామని, అహింస పద్ధతుల్లో ఆలోచన ఉంటే కొన్ని రాజకీయ పార్టీలు ఈరకమైన హింసాత్మక కార్యక్రమాలను ప్రోత్సాహించడం ఖండించే విషయమన్నారు. పౌరసత్వ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని విద్యార్థులు అర్థం చేసుకోవాలని, హోం మంత్రి స్వయంగా ఈ విషయాన్ని పార్లమెంట్‌లో చెప్పారని గుర్తు చేశారాయన. 

* పౌరసత్వ చట్ట.. వ్యతిరేక జ్వాలలు దేశ రాజధానిని దహించి వేస్తున్నాయి. ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. 
* ఆందోళనల్లోకి జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు ఎంట్రీ ఇచ్చారు. 
* పోలీసులు వాళ్లపై లాఠీలు ఝుళిపించడంతో ఢిల్లీ యుద్ధభూమిని మరిపించింది. ఆందోళనకారులు బస్సులకు నిప్పు పెట్టారు. అగ్నిమాపక వాహనాలను ధ్వసం చేసి.. బీభత్సం * సృష్టించారు.
* అల్లరి మూకలను అదుపుకు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 
* టియర్ గ్యాస్  షెల్స్ ప్రయోగించారు. ఘర్షణల్లో 35మంది  విద్యార్థులు, ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. 
Read More : పోలింగ్ డే : జార్ఖండ్ నాలుగో విడత ఎన్నికలు

ట్రెండింగ్ వార్తలు