Viral Marriage: వరుడు ఆర్మీమేజర్.. ఆమె మెజిస్ట్రేట్.. పెళ్ళి ఖర్చు రూ.500!

సాదాసీదా చిరుద్యోగి పెళ్లి కూడా ధూమ్ ధామ్ గా చేయాలని భావించాలని భావించే కాలం ఇది. పెళ్లంటే.. తప్పేట్లు.. తాళాలు.. విందుభోజనాలు.. ఇంకాస్త ముందుకెళ్తే దావత్.. పెళ్ళికి ముందు బరాత్ ఇలా ఎన్నెన్నో పేర్లతో పెళ్లంటే ఆ జంటకి జీవితకాలం గుర్తుండేలా కలలు కనే రోజులివి. అలాంటిది వరుడు ఆర్మీ మేజర్.. వధువు ఓ సిటీకి మేజిస్ట్రేట్. మరి ఇక ఈ జంట పెళ్లి ఇంకెలా ఉండాలి.

Viral Marriage: సాదాసీదా చిరుద్యోగి పెళ్లి కూడా ధూమ్ ధామ్ గా చేయాలని భావించాలని భావించే కాలం ఇది. పెళ్లంటే.. తప్పేట్లు.. తాళాలు.. విందుభోజనాలు.. ఇంకాస్త ముందుకెళ్తే దావత్.. పెళ్ళికి ముందు బరాత్ ఇలా ఎన్నెన్నో పేర్లతో పెళ్లంటే ఆ జంటకి జీవితకాలం గుర్తుండేలా కలలు కనే రోజులివి. అలాంటిది వరుడు ఆర్మీ మేజర్.. వధువు ఓ సిటీకి మేజిస్ట్రేట్. మరి ఇక ఈ జంట పెళ్లి ఇంకెలా ఉండాలి. వచ్చిపోయే స్నేహితులు, బంధువులతో పెళ్లి ప్రాంగణం కళకళలాడాలి.

సహా ఉద్యోగుల నుండి రాజకీయ నేతల వరకు అందరూ వచ్చి ఆ జంటను ఆశీర్వదించి వెళ్ళాలి. కానీ.. ఈ జంట మాత్రం ఆడంబరాలకు దూరం.. పట్టుమని పదిమంది కూడా లేకుండా.. భాజాభజంత్రీల సంప్రదాయానికి కూడా చరమగీతం పాడేసి సింపుల్ గా ఒక్కటయ్యారు. ఈ పెళ్ళికి రిజిస్టారాఫీస్ వేదిక కాగా కేవలం రూ.500తోనే ఈ పెళ్లి తతంగాన్ని ముగించేశారు. మహారాష్ట్రలోని ధార్ సిటీ మేజిస్ట్రేట్ శివాంగి జోషి.. ఆర్మీ మేజర్ అంకిత్ చతుర్వేది పెళ్లి చేసుకున్నారు.

కేవలం ఇరు కుటుంబాల సమక్షంలో స్థానిక రిజిస్టార్ ఆఫీసులో ఈ పెళ్లి వేడుక జరిగింది. కేవలం వధూవరుల దండలు, స్వీట్ల కోసం రూ.500 ఖర్చుతో పెళ్లి తంతును ముగించేశారు. ఉన్నతస్థాయి ఉద్యోగాలు.. ప్రజాసేవలో పునరంకితులైన ఈ ఇద్దరూ ఇలా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతుండగా నెటిజన్లు ఈ జంట చేసిన పనిని మెచ్చుకుంటూ మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు