CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సిద్దమైన CJP.. సమస్యలపై స్పెషల్ ఫోకస్!

కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) అధినేత అభిజిత్ దీప్కే 'క్యా బోల్తీ పబ్లిక్' పేరుతో భారీ దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

cjp party abhijeet dipke launches kya bolti public nationwide campaign

  • ‘క్యా బోల్తీ పబ్లిక్’ ప్రచారం ప్రారంభం
  • విద్య, నిరుద్యోగంపై CJP పోరాటం
  • అంబేడ్కర్, గాంధీ ఆశయాలే లక్ష్యం

CJP: కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) అధినేత అభిజిత్ దీప్కే ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో భారీ దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్‌లో నిర్వహించిన పార్టీ కోర్ కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను, దేశ పరిస్థితులపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడమే ఈ అభియాన్ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. దేశంలో నిరుద్యోగం తీవ్రరూపం దాల్చిందని, దీనిని జాతీయ స్థాయిలో ప్రధాన చర్చనీయాంశంగా మార్చేందుకు సిజెపి గళమెత్తుతుందని స్పష్టం చేశారు.

Megastar Chiranjeevi: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్.. క్లారిటీ ఇచ్చిన చిరు టీం!

ఉచిత, నాణ్యమైన విద్యే లక్ష్యంగా సంస్కరణలు:

విద్యా వ్యవస్థలో ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్య వరకు విపరీతంగా ఖర్చులు పెరిగిపోవడంపై దీప్కే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చదువును కేవలం లాభార్జన వ్యాపారంగా మార్చేశారని, ఈ పరిస్థితిని మార్చడమే తమ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థుల పోరాటానికి లభించిన గొప్ప విజయమని అభివర్ణించారు. ప్రజల్లో కేంద్ర ప్రభుత్వం నింపిన భయాలు తొలగిపోయాయని, తమ హక్కుల సాధన కోసం ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

మహానీయుల ఆశయాలు, రాజ్యాంగబద్ధ పాలనే ధ్యేయం:

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూలు కలలుగన్న ప్రగతిశీల, అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించడమే తమ నూతన పార్టీ ఆశయమని దీప్కే పునరుద్ఘాటించారు. తమ భావజాలం, సిద్ధాంతాలు పూర్తిగా భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాయని చెప్పారు. యువత, విద్యార్థుల భాగస్వామ్యంతోనే దేశంలో నిజమైన, ప్రజాస్వామ్యయుత మార్పులు సాధ్యమవుతాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు.