అసన్‌సోల్‌లో ఉద్రిక్తత : BJP – TMC వర్గాల ఘర్షణ

  • Publish Date - April 29, 2019 / 04:11 AM IST

వెస్ట్ బెంగాల్‌లో లోక్ సభ పోలింగ్ కొనసాగుతోంది. ఏప్రిల్ 29వ తేదీ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటికే ఉద్రిక్తత పరిస్థతులు తలెత్తాయి. అసన్ సోల్ 199 పోలింగ్ బూత్ వద్ద BJP – TMC నేతలు ఘర్షణకు దిగారు. వీరిని అదుపు చేయడానికి కేంద్ర బలగాలు ప్రయత్నించాయి. టీఎంసీ నేతలు బలగాలపై దాడికి పాల్పడ్డారు. వీరిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జీ చేయడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. ఈ గొడవలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బాబుల్ సుప్రీయో కారు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ బూత్‌లో క్రూడ్ బాంబును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలింగ్ బూత్‌లో బీజేపీ ఏజెంట్లు లేరని టీఎంసీ నేతలు వెల్లడిస్తున్నారు.

ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్‌ గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. అసన్‌ సోల్‌ లోని 222, 226వ బూత్‌‌ల్లో కేంద్ర బలగాలు లేవని పోలింగ్‌‌ను బహిష్కరించారు జెమూవా గ్రామస్తులు. దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పశ్చిమబెంగాల్ (8 నియోజకవర్గాలు) నాలుగో విడత పోలింగ్ ఏప్రిల్ 29వ తేదీ సోమవారం ప్రారంభమైంది. ఇక్కడ పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేయడానికి ప్రజలు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.