Bihar : ఇసుక వేలంలో ఘర్షణ..మహిళలకు సంకెళ్లు వేసి నేలపై కూర్చొబెట్టిన పోలీసులు

ఇసుక వేలంలో ఘర్షణ..మహిళలకు సంకెళ్లు వేసి నేలపై కూర్చొబెట్టిన పోలీసులు.

Clashed With Police Women Handcuffed: బిహార్‌లోని గయా జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మంగళవారం (ఫిబ్రవరి 15,2022) ప్రభుత్వ అధికారులకు సహకరిస్తున్న పోలీసు అధికారులతో గొడవపడిన పలువురు గ్రామస్తులను మంగళవారం అరెస్టు చేశారు. ఇసుక గనుల వేలంలో ప్రభుత్వ అధికారులకు సహకరిస్తున్న పోలీసు అధికారులతో ఘర్షణ పడిన నిత్య గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Also read : ఇసుక అక్రమ తవ్వకాల కేసు : ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

దీంతో గ్రామస్తులు పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తు వారిపై రాళ్లు రువ్వారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. తరువాత జనాలకు చెదరగొట్టటానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. జనాలపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు గ్రామస్తుల్ని వెంబడించి మరీ పట్టుకున్నారు. పురుషులు, మహిళలని కూడా చూడకుండా వారిని పట్టుకుని పెడరెక్కలు విరిచి కట్టారు. మహిళలకైతే సంకెళ్లు వేసి నేలపై కూర్చో పెట్టారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వివాదంగా మారింది. కొంతమంది ఆడవారికైతే చేతులువెనక్కి విరిచి వారు కట్టుకున్న చీరలతోనేచేతులు కట్టివేసి నేలపై కూర్చోపెట్టారు.

Also read : Sand Politics : నెల్లూరులో ఇసుక రాజకీయ దుమారం..

బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టటానికి ..స్థానికంగా ఉన్న ఇసుక తవ్వకాల సమస్యల విషయంపై బీహార్ స్టేట్ మైనింగ్ కార్పొరేషన్ ఫిబ్రవరిలో అన్ని ఇసుక మైనింగ్ సైట్‌లలో పర్యావరణ తనిఖీని నిర్వహించే ప్రక్రియను ప్రారంభించింది. వీటిని నిర్వహించే ప్రైవేట్ సంస్థలు, ఇసుక బంకులను తనిఖీ చేయడానికి సాంకేతిక, డ్రోన్‌లను ఉపయోగించనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు