NPR,NRCలకు సంబంధమే లేదు

జాతీయ పౌరపట్టిక(NRC).. జాతీయ జనాభా పట్టిక(NPR)కు ఎలాంటి సంబంధం లేదన్నారు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా. దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్సీపై ఇప్పుడు చర్చ అవసరం లేదన్నారు. ఎన్‌ఆర్సీపై కేబినెట్‌ సమావేశంలో కానీ, పార్లమెంట్‌లో కానీ చర్చ జరగలేదని సృష్టం చేశారు. జనాభా పట్టిక వివరాలను జాతీయ పౌరపట్టికకు ఉపయోగించరంటూ దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై అమిత్‌ షా స్పందిచారు.

2021 ఫిబ్రవరిలో జనగణన,ఎన్‌పీఆర్‌ చేపడతాం. ఎన్‌పీఆర్‌లో పేరు గల్లంతైనా వారి పౌరసత్వానికి ఢోకా లేదు. ఆందోళనలు చల్లార్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. దుష్ప్రచారం చేసేవారితో మైనార్టీలు, పేదలకు నష్టం జరుగుతుంది. మీరు దేశ పౌరులా? అనే ప్రశ్నలు ఎన్‌పీఆర్‌లో ఉండవు. 2010లోనే యూపీఏ ప్రభుత్వం ఎన్‌పీఆర్‌ ప్రక్రియ చేపట్టింది. ఎన్‌పీఆర్‌ను యూపీఏ ప్రభుత్వమే తీసుకువచ్చింది. అప్పుడు దీనిపై ఎవరూ ప్రశ్నించలేదు.. ఇప్పుడెందుకు అడుగుతున్నారు? జనాభా లెక్కల కోసమే ఎన్‌పీఆర్‌. ఎన్‌పీర్‌ విషయంలో విపక్షాలు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయి. సీఏఏలో ఎవరి పౌరసత్వం లాక్కునే ప్రసక్తే లేదు.కేరళ, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ర్టాలకు సీఏఏతో ఉపయోగం ఉంటుంది. సీఏఏను వ్యతిరేకించాలన్న ఉద్దేశాన్ని ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు పునఃపరిశీలించాలి. మీ రాజకీయాల కోసం పేదలను ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి దూరం చేయకండని అమిత్‌ షా అన్నారు.

జాతీయ జ‌నాభా రిజిస్ట‌ర్‌(NPR)అప్ డేట్ కు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ(డిసెంబర్-24,2019) కేంద్ర కేబినెట్ ఎన్‌పీఆర్‌ అప్ డేట్ ప్రపోజల్ కు ఆమోద్రముద్ర వేసింది.  ఎన్‌పీఆర్‌ అప్ డేట్ చేయడం కోసం ప్రభుత్వం 8వేల500కోట్లు ఖర్చుచేయనుంది. దేశంలోని ప్ర‌తి ఒక్క పౌరుడి పూర్తి డేటాబేస్‌ను త‌యారు చేయ‌డ‌మే ఎన్‌పీఆర్ ల‌క్ష్య‌మ‌ని సెన్స‌స్ క‌మిష‌న్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.  ఎన్‌పీఆర్ చేయాలంటే…పౌరులు ఎవ‌రైనా ఒక ప్రాంతంలో ఆరు నెల‌ల క‌న్నా ఎక్కువ స‌మ‌యం ఉన్న‌వారే అర్హులు. దేశంలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఎన్‌పీఆర్‌లో తప్పనిసరిగా రిజిస్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. జనాభా లెక్క‌ల‌(సెన్స‌స్‌)కు ఎన్‌పీఆర్ అనుసంధాన‌మై ఉంటుంది.