ముంబై ఉగ్ర దాడులకు 11 ఏళ్లు : నివాళులర్పించిన ఫడ్నవీస్, కోశ్యారీ

  • Publish Date - November 26, 2019 / 03:58 AM IST

2008 లో ముంబై ఉగ్రదాడిలో మరణించిన మృతులకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ నివాళులర్పించారు. ముంబై మెరైన్ డ్రైవ్ లోని పోలీసు స్మారకస్ధూపం వద్ద మంగళవారం ఉదయం వారు పుష్పగుఛ్చం ఉంచి అమరులైన పోలీసులకు నివాళులర్పించారు.   

సరిగ్గా పదకొండేళ్ల క్రితం 2008 నవంబరు 26న పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు ముంబైలో ప్రవేశించి మారణహోమానికి పాల్పడ్డారు. పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి లష్కరే తొయిబా ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, మరో తొమ్మిది మంది చొరబడ్డారు. ఒబెరాయ్ హోటల్, తాజ్, ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ల వద్ద నాలుగు రోజుల పాటు మారణహోమం సృష్టించారు.

ఆనాటి ఉగ్రదాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఆరుగురు అమెరికా పౌరులు సైతం ఉన్నారు. ఈ ఘటనను యావత్తు ప్రపంచం ముక్త కంఠంతో ఖండించింది. ఈ దాడి జరిగి పదకొండేళ్లు గడిచినా ముంబైవాసులు నాటి విధ్వంసాన్ని తలచుకుని ఇప్పటికీ భయంతో వణికిపోతుంటారు.

 

ట్రెండింగ్ వార్తలు